ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
స్వల్ప మార్పులు…

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య నిర్వహిస్తారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. మార్చి 20వ తేదీన జరగాల్సిన మార్చి ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 ఎగ్జామ్స్ ను మార్చి 21వ తేదీన నిర్వహిస్తారు. ఇక మార్చి 3వ తేదీన జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2 పేపర్ పరీక్షలను మార్చి 4వ తేదీకి మార్చారు. మిగతా పరీక్షలు యథావిథిగానే ఉంటాయి.
ఏపీ ఇంటర్ 2026 - ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 23 - ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- ఫిబ్రవరి 25 - ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1
- ఫిబ్రవరి 27 - ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1, బోటనీ పేపర్ 1
- మార్చి 2 - ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ
- మార్చి 5 - ఫస్ట్ ఇయర్ జూవాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1
- మార్చి 7 - ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 1,
- మార్చి 10- ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1
- మార్చి 12 - ఫస్ట్ ఇయర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1
- మార్చి 14- ఫస్ట్ ఇయర్ సివిక్స్ 1
- మార్చి 17 - ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1
- మార్చి 21 - ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1
- మార్చి 24 - ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1
ఏపీ ఇంటర్ 2026 - సెకండ్ ఇయర్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 24 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- ఫిబ్రవరి 26 - ఇంగ్లీషు పేపర్ 2
- ఫిబ్రవరి 28 - సెకండ్ ఇయర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2
- మార్చి 4 - సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2
- మార్చి 6 - సెకండ్ ఇయర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2
- మార్చి 9- సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2బి
- మార్చి 11- సెకండ్ ఇయర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2
- మార్చి 13- సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2
- మార్చి 16 - సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2
- మార్చి 18 - సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2
- మార్చి 23 - సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. ఇక ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.
{{/usCountry}}ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. ఇక ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.
{{/usCountry}}