ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రాబోయే 2027-28 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల రూపురేఖలను మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP-2020) లక్ష్యాలకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ పరఖ్ మార్గదర్శకాలకు లోబడి ఈ నూతన విధానాన్ని తీసుకురానున్నారు.

ఇప్పటివరకు అమలులో ఉన్న విధానంలో విద్యార్థులు పుస్తకాల్లోని సమాధానాలను కంఠస్థం చేసి బట్టీ పట్టి పరీక్షల్లో యథాతథంగా రాసేవారు. అయితే ఇకపై ఈ ధోరణికి స్వస్తి పలకనున్నారు. విద్యార్థుల్లోని ఆలోచనా శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యం, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలను రూపొందించనున్నారు.
విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలు, సృజనాత్మకతను అంచనా వేసేందుకు ప్రశ్నపత్రాల్లో ప్రత్యేకంగా 10 శాతం మార్కులను కేటాయిస్తారు. అంటే ఒక ప్రశ్నలు ఇచ్చి.. దీనిని మీరైతే ఎలా చేస్తారు? సొంతంగా రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు పుస్తకాల్లోని విషయాలకు సంబంధం ఉండదు.
సాంప్రదాయ ప్రశ్నల స్థానంలో, విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే కొత్త ప్రశ్నలను చేర్చనున్నారు. బోర్డు ఆమోదం అనంతరం రాబోయే విద్యాసంవత్సరం ముద్రించే పుస్తకాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే పలువురు సబ్జెక్ట్ నిపుణుల నుండి నూతన శైలి ప్రశ్నలను సేకరించారు.
దేశవ్యాప్తంగా పాఠశాల విద్య, పరీక్షల మూల్యాంకనం, విద్యార్థుల సామర్థ్యాల లెక్కింపులో ఏకరూపత తీసుకురావడానికి NCERT పరిధిలోని జాతీయ మూల్యాంకన కేంద్రం 'పరఖ్' విధానాన్ని రూపొందించింది. ఈ నిబంధనలపై అవగాహన పెంచేందుకు NCERT ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది.
విద్యార్థులకు కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా, వారిలో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించేలా బోధనా పద్ధతుల్లో మార్పులు తెచ్చేందుకు అధ్యాపకులకు కూడా తగిన శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులకు క్రియేటివిటీ పెరిగేలా తయారుచేస్తారు.
{{/usCountry}}విద్యార్థులకు కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా, వారిలో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించేలా బోధనా పద్ధతుల్లో మార్పులు తెచ్చేందుకు అధ్యాపకులకు కూడా తగిన శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులకు క్రియేటివిటీ పెరిగేలా తయారుచేస్తారు.
{{/usCountry}}ఈ కొత్త పరీక్షా విధానం ద్వారా విద్యార్థుల్లో కేవలం మార్కుల వేట కాకుండా ముఖ్యమైన సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇందులో భాగంగా పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, సొంత మాటల్లో సమాధానం రాయాలి. కొత్త రకం సమస్యలను విభిన్న కోణాల్లో విశ్లేషించి, వినూత్న పరిష్కారాలు కనుగొనాలి. ఒక లక్ష్యం కోసం ఇతరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలను పంచుకోవడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి.
ఈ మార్పుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మరింత మెరుగైన ప్రతిభ చూపడానికి అవకాశం లభిస్తుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. వారిలో క్రియేటివిటీ పెరిగి భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు వెళ్తారని అంటున్నారు.