ప్రధాని మోదీ పిలుపు - పొదుపు బాటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..! కాన్వాయ్ తగ్గింపు

ఇంధన పొదుపు దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేసే పనిలో పడింది. ప్రధాని మోదీ పిలుపుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్ వాహనాలను 50 శాతం తగ్గించుకున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో మరిన్ని పొదుపు చర్యలపై ప్రకటన వెలువడనుంది.

Published on: May 14, 2026, 09:05:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chandrababu Pawan Kalyan Convoy Reduce : పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి… ఇంధన పొదుపును పాటించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిగత భద్రతా వాహనాల శ్రేణి (కాన్వాయ్) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

వాహనాల కాన్వాయ్ తగ్గింపు….

ప్రధాని మోదీ స్ఫూర్తితో ఇకపై తాము పర్యటించే సమయాల్లో కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలోనే కాకుండా…. జిల్లాల పర్యటనల సమయంలోనూ వాహనాల సంఖ్య సగానికి మించకూడదని స్పష్టం చేశారు. కేవలం తమకే కాకుండా మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత యుద్ధ వాతావరణం…. సంక్షోభ పరిస్థితుల వల్ల చమురు ధరలపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని మోదీ సంకల్పానికి మద్దతుగా తన కాన్వాయ్‌ను సగానికి కుదిస్తూ భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ప్రధాని మోదీ స్వయంగా పొదుపు పాటిస్తూ దేశ ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారని…. అదే స్ఫూర్తిని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్భాటాలకు పోకుండా నిరాడంబరంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

నేడు కేబినెట్ భేటీ - కీలక విధాన ప్రకటన

మరోవైపు ఇంధన పొదుపుతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో అనుసరించాల్సిన ఆర్థిక పొదుపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్) సమావేశంలో దీనిపై చర్చించి ఒక కీలక విధాన నిర్ణయం తీసుకోనున్నారు. దేశం కోసం ప్రతి పౌరుడు పొదుపు దిశగా ఆలోచించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More