ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 22 నెలలుగా ప్రతి గంటను ప్రజల కోసమే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన 'పేదల సేవలో' మరియు మేడే పురస్కారాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులకు, పరిశ్రమల యాజమాన్యాలకు 'శ్రమ శక్తి' పురస్కారాలను అందజేసి వారిని ఘనంగా సత్కరించారు.

సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండేళ్ల కిందటి వరకు భయానక వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. "రెండేళ్ల మునుపు మనం ఈ విధంగా సరదాగా నవ్వుకుంటూ కూర్చునే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు కూడా బయట తిరగలేని దుస్థితి ఉండేది. ప్రజలందరికీ మరో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది" అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తాను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ముగ్గురం కలిసి ఇచ్చిన హామీ కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు.
బందరు పోర్టు…. పోలవరం ప్రాజెక్టులపై డెడ్ లైన్
కృష్ణా జిల్లా అభివృద్ధికి చిహ్నమైన మచిలీపట్నం (బందరు) పోర్టుపై ముఖ్యమంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గత ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి గందరగోళం సృష్టించినా…. ఇప్పుడు పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. "బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ వంటి పనులు ఇప్పటికే 57 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బందరు పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం," అని ఆయన ప్రకటించారు.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై స్పందిస్తూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, పుష్కరాల కంటే ముందే పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 13 ఏళ్ల క్రితం తాము నిర్మించిన పట్టిసీమ వల్లే నేడు కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేదని ఆయన గుర్తు చేశారు.
ప్రతి నెలా ఒకటో తేదీన 'పేదల సేవలో' కార్యక్రమం ద్వారా ఇంటికే పింఛన్లు అందిస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏటా రూ.33 వేల కోట్లు కేవలం పింఛన్ల కోసమే ఖర్చు చేస్తున్నామని వివరించారు. "62.47 లక్షల మందికి ప్రతి నెలా రూ.2,700 కోట్లు సిద్ధంగా ఉంచుతున్నాం. దీన్ని నేను భారంగా భావించడం లేదు, పేదలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నాను," అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}ప్రతి నెలా ఒకటో తేదీన 'పేదల సేవలో' కార్యక్రమం ద్వారా ఇంటికే పింఛన్లు అందిస్తున్నామని సీఎం తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏటా రూ.33 వేల కోట్లు కేవలం పింఛన్ల కోసమే ఖర్చు చేస్తున్నామని వివరించారు. "62.47 లక్షల మందికి ప్రతి నెలా రూ.2,700 కోట్లు సిద్ధంగా ఉంచుతున్నాం. దీన్ని నేను భారంగా భావించడం లేదు, పేదలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నాను," అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}విశాఖ తర్వాత ఆదాయంలో కృష్ణా జిల్లా ముందంజలో ఉందని, అమరావతి రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చారని కొనియాడారు. జిల్లాలో భారత్ మాలా పరియోజన కింద రూ.574 కోట్లతో రోడ్ల విస్తరణ జరుగుతోందని, మచిలీపట్నం బైపాస్ రోడ్డును 6 లేన్లుగా మారుస్తున్నామని చెప్పారు.