అమరావతి-హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 70 నిమిషాలే : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Amaravati-Hyderabad : అమరావతి, హైదరాబాద్ మధ్య ప్రయాణం కేవలం 70 నిమిషాల్లోనే పూర్తవుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతెన నిర్మాణం ఉంటుందన్నారు.

Published on: Apr 28, 2026, 14:24:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ల మధ్య కొత్త హై-స్పీడ్ రైలు మార్గం ద్వారా ప్రయాణ సమయం 70 నిమిషాలగా ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎర్రపాలెం నుండి నంబూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం, కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతెన నిర్మాణం ఉంటాయన్నారు.

అమరావతి-హైదరాబాద్ హైస్పీడ్ రైలు
అమరావతి-హైదరాబాద్ హైస్పీడ్ రైలు

గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ప్రతిపాదిత హై-స్పీడ్ నెట్‌వర్క్ అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబైలను కలుపుతుందని అన్నారు. హైదరాబాద్ నుండి పూణేకు గంటా 55 నిమిషాలు, పూణే నుండి ముంబైకి 48 నిమిషాలు, చెన్నై నుండి బెంగళూరుకు 73 నిమిషాలు, హైదరాబాద్ నుండి బెంగళూరుకు సుమారు రెండు గంటల ఎనిమిది నిమిషాలు, అమరావతి నుండి చెన్నైకి 112 నిమిషాలు పడుతుందని ఆయన తెలిపారు.

'బుల్లెట్ రైలు, మనందరి కలల ప్రాజెక్ట్. మీకు తెలిసినట్లుగా, అహ్మదాబాద్ నుండి ముంబై బుల్లెట్ రైలు పురోగతికి సంబంధించిన వీడియోలను మీరు చూసి ఉంటే, ఆ 500 కిలోమీటర్ల మార్గం ఒక గంట 57 నిమిషాల్లో పూర్తవుతుంది. కాబట్టి ప్రాథమికంగా ముంబై, సూరత్, వాపి, బరోడా, అహ్మదాబాద్ వంటి ఈ పెద్ద నగరాలన్నీ ఒకే ఎకనామిక్ జోన్‌గా, ఒకే ఆర్థిక ప్రాంతంగా మారతాయి. అదే అద్భుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతుంది, అమరావతి నుండి హైదరాబాద్ 70 నిమిషాల్లో చేరుకుంటారు.' అని కేంద్రమంత్రి అన్నారు.

ఇలాంటి అనుసంధానం, దక్షిణ రాష్ట్రాల వ్యాప్తంగా ఒక "హై-స్పీడ్ డైమండ్"ను సృష్టిస్తుందని చెప్పారు. తూర్పు తీర మార్గాన్ని మొత్తం నాలుగు రైల్వే లైన్లుగా ఉన్నతీకరిస్తామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సుమారు రూ.9,889 కోట్ల వ్యయంతో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ఇటీవల ఆమోదించిన మూడో, నాల్గో లైన్లతో కూడిన ఈ క్వాడ్రప్లింగ్ ప్రాజెక్ట్, తీరప్రాంత కారిడార్‌ను సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. కోల్‌కతా నుండి చెన్నై వరకు ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్లను నాలుగు లైన్లకు ఉన్నతీకరించడం ద్వారా సుమారు 500 కొత్త సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్లను నడపడానికి వీలవుతుందని, అలాగే ఓడరేవులు, పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలకు మెరుగైన ప్రవేశ సౌలభ్యం కలుగుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ గురించి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి గతంలో రూ.886 కోట్ల కేటాయింపు ఉండగా, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.10,134 కోట్లు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రూ.1.06 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా 74 రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నారని చెప్పారు.

డేటా సెంటర్లను నిర్మించే కంపెనీలతో సహా పలు కంపెనీలు సర్వర్లను భారతదేశంలోనే తయారు చేయాలని వైష్ణవ్ కోరారు. విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇండియాఏఐ మిషన్ కింద సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్ ఆపరేటర్లు నీటి వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ఇంధన సామర్థ్యం, రీసైక్లింగ్, మురుగునీటి పునర్వినియోగంపై చేసే పనులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More