AP Tourism : ఐదేళ్లలో 50,000 టూరిజం గదులను లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్

AP Tourism : కేరళకు తీసిపోని ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రప్రదేశ్‌లో ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. సరైన ప్రచారం, పక్కా ప్రణాళికతో ప్రపంచ పర్యాటక పటంలో మన రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టగలమన్నారు.

Published on: Apr 26, 2026, 06:06:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కందుల దుర్గేశ్. గోదావరి పుష్కరాల నాటికి లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కీలక ఆదేశాలు జారీ చేశాను. 21 ప్రధాన దేవాలయాల వద్ద ‘టెంట్ సిటీలు’ ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సదుపాయాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

ఏపీ టూరిజం
ఏపీ టూరిజం

పర్యాటక రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘హోమ్ స్టే’ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించాలని ఆశించే పర్యాటకులకు ఇది మంచి అవకాశం కాగా, స్థానిక ప్రజలకు ఉపాధి మార్గాలను కూడా విస్తరిస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50,000 గదుల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. గోదావరి టూరిజం సర్క్యూట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

'వైజాగ్–అరకు మధ్య విజయవంతమైన కారవాన్ టూరిజం నమూనాను గోదావరి జిల్లాల్లో కూడా అమలు చేయనున్నాం. అలాగే కాకినాడ, ఉప్పాడ, పేరుపాలెం బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ బీచ్ లుగా గుర్తింపు పొందేందుకు చర్యలు ప్రారంభించాం. పర్యాటక ప్రాజెక్టుల అమలు, నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, సమయానికి పనులు పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచుతున్నాం.' అని మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పర్యాటక రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తూ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి ఉన్నామన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More