ఏప్రిల్ 27 నుంచి అమరావతి యువతకు ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్.. రవాణా, భోజన సదుపాయాలు కూడా

APCRDA : రాజధాని అమరావతి పరిధిలోని యువతకు గుడ్‌న్యూస్. ఏపీసీఆర్‌డీఏ ఏప్రిల్ 27 నుండి అమరావతి యువతకు ఉచిత నైపుణ్య శిక్షణను ప్రారంభించనుంది.

Updated on: Apr 23, 2026, 19:52:58 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ) ఏప్రిల్ 27 నుంచి రాజధాని ప్రాంత యువత కోసం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఏపీసీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సహకారంతో, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

అమరావతి యువతకు ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్
అమరావతి యువతకు ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్

అమరావతి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంచి, జీవనోపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. వివిధ రంగాలలో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను శిక్షణార్థులకు అందించేలా ఈ శిక్షణా కోర్సులను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కోర్సులలో ట్యాలీతో జీఎస్టీ అసిస్టెంట్, కంప్యూటర్ నెట్‌వర్క్, స్టోరేజ్, వీఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లాంటివాటితో సహా డిజిటల్ మార్కెటింగ్ వంటివి ఉన్నాయి. అంతేకాదు సాఫ్ట్ స్కిల్స్, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిఫ్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ కూడా అందిస్తారు.

ఈ శిక్షణ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉచితంగా ఉంటుంది. శిక్షణ తీసుకునేవారికి రవాణా, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తారు. తరగతులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి.

రాజధాని ప్రాంతానికి చెందిన ఆసక్తిగల అభ్యర్థులు నమోదు చేసుకుని తరగతులకు హాజరు కావచ్చు. మరిన్ని వివరాల కోసం దరఖాస్తుదారులు 9848424207 నంబరును సంప్రదించవచ్చు, లేదా వారి వారి గ్రామాల్లోని సీఆర్డీఏ సమన్వయకర్తలను సంప్రదించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More