ఆంధ్రప్రదేశ్‌కు ఒక మైలురాయి.. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు
ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయిన శుభ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. 2014 - 2019 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. 18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదలు తెలిపారు చంద్రబాబు.

'భోగాపురం ఎయిర్ పోర్టు ఆ ప్రాంత కనెక్టివిటీ పెంచి అభివృద్దికి దోహద పడుతుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ.. ఈ శుభసందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.' అని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఒక మైలురాయి రోజు అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతమైన ధ్రువీకరణ విమానం కనెక్టివిటీని పెంచడంలో, ఉత్తరాంధ్ర వృద్ధి సామర్థ్యాన్ని పెంచడంలో చేయడంలో నిర్ణయాత్మక అడుగును సూచిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దార్శనికత, నాయకత్వానికి ధన్యవాదాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం(2014–19) హయాంలో రూపొందించబడి ప్రారంభించిన ఈ విమానాశ్రయం జూన్ 2026 నుండి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధంగా ఉంటుందన్నారు. ఉత్తరాంధ్రను కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని చెప్పారు.
ఈ రోజు భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి భోగాపురానికి ఎయిరిండియా వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ చేరుకుంది. ఈ టెస్టింగ్ ఫ్లైట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్ ప్రయాణం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమవుతోంది. జూన్‌లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. జీఎంఆర్ సంస్థ ఈ పనులను చేపట్టింది. 280 కి.మీ వేగంతో వీచే తుపాను గాలులను తట్టుకునేలా విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు.
రన్‌వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 4, 2026న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి అయింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


