భోగాపురం విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం - విజయవంతంగా తొలి విమానం ల్యాండింగ్‌

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ ఉదయం11.00 గంటలకు రన్ వేపై తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణం చేశారు.

Published on: Jan 4, 2026, 12:36:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌ అయింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి భోగాపురానికి ఎయిరిండియా వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ చేరుకుంది. ఈ టెస్టింగ్ ఫ్లైట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్‌, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్ ప్రయాణం చేశారు.

భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌

అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయం నిర్మితమవుతోంది. జూన్‌లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. జీఎంఆర్‌ సంస్థ ఈ పనులను చేపట్టింది. 280 కి.మీ వేగంతో వీచే తుపాను గాలులను తట్టుకునేలా విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు.

రన్‌వే, టెర్మినల్‌ భవనాలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే… ఇవాళ(జనవరి 4, 2026) తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ విజయవంతంగా పూర్తి అయింది.

విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న ఈ భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మెుదటి దశలో రూ.4,592 కోట్ల వ్యయంతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తారు. 2203 ఎకరాల్లో విమనాశ్రయం విస్తీర్ణం పూర్తి చేస్తారు. ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం మరో 500 ఎకరాలను కేటాయించింది. ఒక్కొటి 3.8 కిలో మీటర్ల పొడవుతో రెండు రన్ వేలు నిర్మిస్తున్నారు. రెండో దశ పనులు తర్వాత జరగనున్నాయి.

2026 జూన్ నెల నుంచే విమాన రాకపోకలు సాగించేలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరిలో టెస్టింగ్‌ ఫ్లైట్‌ ఎగిరింది. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కాబోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సీఎం చంద్రబాబు హర్షం :

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ పై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అభినందనలు అని ట్వీట్ చేశారు. ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడబోతుందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

వైఎస్ జగన్ ట్వీట్…

విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావ‌డం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి అని మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందన్నారు.

“ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది” అని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More