AP Govt : డ్వాక్రా మహిళలకు బంగారు మిత్రలుగా బాధ్యత - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. డ్వాక్రా మహిళలకు బంగారు మిత్రలుగా బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారితపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

సమన్వయంతో ముందుకెళ్లాలి - సీఎం చంద్రబాబు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల సంస్థలు సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్ హెచ్ జీలకు సంబంధించి ఈ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశంపై వివిధ దేశాలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న అత్యుత్తమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.
2047 స్వర్ణాంధ్ర మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో జీరో పావర్టీ మిషన్ సమర్ధంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన మిషన్ కు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.1100 కోట్లును సమర్ధంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. అటు జాతీయ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా పట్టణ ప్రాంతాల్లోనూ పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికలు చేయాలన్నారు. వీటితో పాటు స్వయం సహాయ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు స్వయం పేరిట బ్రాండింగ్ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబం యూనిట్ గా పథకాలు…
ప్రభుత్వ పథకాలు, పీ4 విధానం స్వయం సహాయక సంఘాల సహకారంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని మార్గదర్శి - బంగారు కుటుంబం MBK 10-20 గా పిలవాలని సూచించారు. సమాజంలో అట్టఅడుగున ఉన్న 20 శాతం మందిని ఆర్ధికంగా ఎగువన ఉన్న 10 శాతం స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.
యూనిట్ గా ఫ్యామిలీ….
పేదరికం నుంచి బయటపడిన వారికి ఒక గౌరవ ప్రదమైన పేరును ఖరారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలును వ్యక్తిగతంగా కాకుండా ఫ్యామిలీ యూనిట్ గా పరిగణించాలి సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాల ద్వారా ఒక కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో అంచనా వేయాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంలో జీరో పావర్టీ మిషన్ మొదటి అడుగు అనివివరించారు.
డ్వాక్రా సభ్యుల సేవలను వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చన్నారు. డ్వాక్రా మహిళలకు బంగారు మిత్రలుగా బాధ్యత అప్పగించాలని అధికారులకు సూచించారు. వారిని ఎంఎస్ఎంఈలు గా ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











