ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.11,359 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోని కడపల్లె నుంచి ఆయన ఈ కీలక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర మున్సిపల్ చరిత్రలోనే ఈ రోజును ఒక సువర్ణాధ్యాయంగా అభివర్ణించిన సీఎం.. పట్టణ ప్రాంతాలను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధిపై నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
రూ.11,359 కోట్ల విలువైన పనులకు తాజాగా అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో ఇప్పటికే రూ.22,330 కోట్ల అభివృద్ధి పనులు విభిన్న దశల్లో శరవేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. మరో ఆరు నెలల వ్యవధిలో రూ.17,000 కోట్ల విలువైన కొత్త పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం నడుస్తున్న, ప్రతిపాదించిన పనులన్నీ కలిపి మొత్తం రూ.50,000 కోట్ల భారీ ప్రణాళికతో మున్సిపల్ శాఖ ముందడుగు వేస్తోందన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతికి పెద్దపీట వేస్తున్నామని, ఈ నమూనాలో రూ.7,496 కోట్ల పనులు చేపట్టనున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నం కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చంద్రబాబు అన్నారు. ఒక్క విశాఖ నగర పరిధిలోనే ఏకంగా రూ.3,890 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
విశాఖలో ఇప్పటికే 28,500 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఎలాంటి వివాదాలు, అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో గృహాల నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు.
{{/usCountry}}విశాఖలో ఇప్పటికే 28,500 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఎలాంటి వివాదాలు, అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన టిడ్కో గృహాల నిర్మాణంపై సీఎం స్పష్టత ఇచ్చారు.
{{/usCountry}}'గత పాలకులు కేంద్ర ప్రాయోజిత పథకమైన జల్ జీవన్ మిషన్ సహా పలు అభివృద్ధి నిధులను సద్వినియోగం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. మేం ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. 2027 నాటికి రాష్ట్రంలోని టిడ్కో గృహనిర్మాణ ప్రాజెక్టులన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం.' అని చంద్రబాబు నాయుడు అన్నారు.
పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా, రాబడిని పెంచే మార్గాలపై శ్రద్ధ చూపాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో క్వాలిటీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ సీవరేజి, అందమైన పార్కులు, సెంట్రల్ మీడియన్లు నిర్మించాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసే సమగ్ర నీటి సరఫరా ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు.
పట్టణాల్లో వారాంతపు ఆర్థిక కార్యకలాపాలను, వినోద రంగాన్ని ప్రోత్సహించి లోకల్ ఎకానమీని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజన్ 2047లో భాగంగా ప్రతీ మున్సిపాలిటీని స్వర్ణ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ పనుల శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు గుండిశెట్టిపల్లె వద్దకు చేరుకుని హంద్రీనీవా సుజల స్రవంతి జలాలకు జలహారతి ఇచ్చారు.