ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీసులు అంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని… ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుందని చెప్పారు. ఇవాళ మంగళగిరి 6వ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించారు.
మీరు చేసేది నిస్వార్థ సేవ - సీఎం చంద్రబాబు

ఈ సంవత్సరం విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. “మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు..మీరు చేసేది నిస్వార్థ సేవ. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పై ఖచ్చితంగా ఉంటాను. పెట్టుబడులు పెడితే ఇబ్బంది ఉండదన్న నమ్మకం ఉంది కాబట్టే గూగుల్ సంస్థ వచ్చింది. ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం ను అణిచివేయడంలో మీరు ఎంతో పేరు తెచ్చుకున్నారు” అని ప్రశంసించారు.
“నేరాల తీరు మారుతోంది క్రిమినల్స్ అప్ డేట్ అవుతున్నారు. మరి వారి ఆటకట్టించాలంటే మీరు మరింత అప్ డేటెడ్ వెర్షన్ తో ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నాం.టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది.అప్పుడు ఎటువంటి నేరస్తుడిని అయినా పట్టుకోవచ్చు.ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్‌గా పట్టుకోవచ్చు. అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్రచందనం దొంగలను కట్టడి చేస్తున్నారు. పోలీస్ అంటే సమర్థవంతంగా ఉండాలి...పోలీస్ అంటే భయం ఉండాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి” అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
“నేరాల కట్టడి విషయంలో సీరియస్సుగా ఉండాలి.. లేకుంటే నేరాలు ఎక్కువ అవుతాయి. శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడూ రాజీపడలేదు. అందుకే నాపై నక్సలైట్లు క్లైమైర్ మైన్లతో దాడి చేశారు. ఓ దొంగ, ఓ డెకాయిట్ ఏదోక ప్రాంతానికే పరిమితమవుతారు. కానీ రాజకీయ ముసుగులో చేసే నేరాలతో సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో పోలీసులు మరింత అలెర్టుగా ఉండాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
{{/usCountry}}“నేరాల కట్టడి విషయంలో సీరియస్సుగా ఉండాలి.. లేకుంటే నేరాలు ఎక్కువ అవుతాయి. శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడూ రాజీపడలేదు. అందుకే నాపై నక్సలైట్లు క్లైమైర్ మైన్లతో దాడి చేశారు. ఓ దొంగ, ఓ డెకాయిట్ ఏదోక ప్రాంతానికే పరిమితమవుతారు. కానీ రాజకీయ ముసుగులో చేసే నేరాలతో సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో పోలీసులు మరింత అలెర్టుగా ఉండాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
{{/usCountry}}సోషల్ మీడియా అనేది పోలీసులకు అతి పెద్ద ఛాలెంజ్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యనించారు. “ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు.. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టుల విషయంలో చాలా మంది కుమిలిపోతున్నారు. శాంతి భద్రతలకంటే ఏదీ ముఖ్యం కాదు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే.. అదే చివరి రోజు అనిపించేలా పోలీసులు కఠినంగా ఉండాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మరింత బలోపేతం చేస్తాం - సీఎం చంద్రబాబు
“వైద్యసేవలకు పోలీసులకు 16 నెలల్లో రూ.33 కోట్లు విడుదల చేశాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద రూ.23 కోట్లు అందించాం. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఒక డీఎ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ డబ్బును రెండు విడతల్లో చెల్లిస్తున్నాం. శాఖాపరమైన పదోన్నతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.