అలా చేసిన వారికి రూ.100 కోట్లు ఇస్తాం.. క్వాంటమ్ టాక్‌లో చంద్రబాబు!

ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందన్నారు.

Published on: Dec 23, 2025, 17:25:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్వాంటం వ్యాలీకి ఆతిథ్యం ఇచ్చే గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని ప్రపంచంలోని టాప్ ఐదు క్వాంటం కంప్యూటింగ్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు రాష్ట్ర క్వాంటం విజన్‌ను ఆవిష్కరించారు. వేలాది మంది విద్యార్థులను వర్చువల్‌గా ఉద్దేశించి క్వాంటమ్ టాక్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ తదుపరి తరం నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వేలాది అధిక-విలువైన ఉద్యోగాలను సృష్టించడానికి, ఉత్పత్తి-కేంద్రీకృత విధానాన్ని అవలంబించడానికి, అన్ని రకాల క్వాంటం కంప్యూటర్‌లను అభివృద్ధి చేయడానికి, క్వాంటం కంప్యూటర్ల తయారీలో పూర్తి సరఫరా గొలుసును సాధించడానికి కృషి చేస్తుందని నొక్కి చెప్పారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతోందన్నారు.

'ఆంధ్రప్రదేశ్ విజన్: అమరావతిలో క్వాంటం వ్యాలీ. ఆంధ్రప్రదేశ్ ఫాలో కాదు, మేం నాయకత్వం వహిస్తాం. అమరావతిలో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. 80 శాతం లేదా 85 శాతం కాంపోనెంట్ భాగస్వాములు సిద్ధంగా ఉన్నారు.' అని చంద్రబాబు అన్నారు.

రెండేళ్లలోపు అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు ఉత్పత్తి అవుతాయని, ఎవరైనా ఏదైనా నాలెడ్జ్ కంపెనీ లేదా టెక్నాలజీని ప్రారంభించాలనుకుంటే అమరావతికి రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన పరిశోధనలకు క్వాంటం కంప్యూటింగ్‌లో నోబెల్ బహుమతి పొందిన ఎవరికైనా రూ.100 కోట్ల బహుమతిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆవిష్కరణ, ఉత్పత్తి ఆధారిత భవిష్యత్తుకు గురించి ఆలోచించాలని చెప్పారు.

1971లో చైనా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందని, భారత్‌లో 1991లో ఆ సంస్కరణలు వచ్చాయన్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఎక్కడా వెనక్కు తిరిగి చూడలేదని చెప్పారు. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా.. మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ చిరునామాగా మారబోతోందన్నారు.

'వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఎకో సిస్టమ్ తయారు చేయాలని ప్రభుత్వ లక్ష్యం. భారత్‌లో నైపుణ్యాలు ఉన్నా.. క్వాంటమ్ రంగంలో మరింత పెట్టుబడుల విస్తృతి పెరగాల్సి ఉంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నేపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. ఐటీ విప్లవం లాగా.. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ విప్లవాన్ని భారతీయులు అందిపుచ్చుకోవాలి.' అని చంద్రబాబు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More