పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ నేతల కామెంట్స్.. చంద్రబాబు రియాక్షన్ ఇదే
ప్రతిష్టాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్టుగా చంద్రబాబు అన్నారు. జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రతిష్టాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కోటి మందితో ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. యోగాంధ్ర-2026 కార్యక్రమం నిర్వహాణపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమాలను ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వివరించారు. అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాల పైనా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా. జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. యోగాను మన జీవన విధానంలో భాగం చేసేందుకు యోగాంధ్ర ద్వారా ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యం.' అని చంద్రబాబు అన్నారు.
ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ ‘Yoga for Healthy Aging’ అని చంద్రబాబు అన్నారు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను అనుసరించాలని చెప్పడమే థీమ్ ఉద్దేశమని తెలిపారు. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదని, ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి నిత్య సాధనగా అలవాటు చేసుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారాలన్నారు. ఈసారి యోగాంధ్ర 2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు.
'జూన్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం. అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్టానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25 వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహిస్తాం. ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్ నిర్ణయించాం. ఎన్‌టీఆర్ జిల్లాలో పోలీసు సిబ్బంది, కోనసీమలో రైతులు వంటి ప్రత్యేక వర్గాలతో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో 2 వేల నుంచి 3 వేల మంది పాల్గొనే కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించి యోగా-టూరిజాన్ని ప్రోత్సహిస్తాం. ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి చారిత్రక ప్రాంతాలు వేదికలుగా ఈ యోగా కార్యక్రమం చేపడుతున్నాం.'అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఏపీ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా నిరంతర శిక్షణ చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జూన్ నెల మొత్తాన్ని ‘యోగా నెల’గా ప్రకటించామని, దీనిని సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సాయం తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటికి యోగా చేరేలా మంతెన సత్యనారాయణ రాజు ప్రత్యేక వీడియోలు రూపొందించారన్నారు. వాట్సాప్ నంబర్ 8142404888కు 'Hi' అని మెసేజ్ పంపిస్తే యోగా వీడియోలు వస్తాయన్నారు. యోగాంధ్ర-2026 కోసం యోగాంధ్ర పోర్టల్‌ను ప్రారంభించామని, yogandhra.ap.gov.in ద్వారా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, నమోదు ప్రక్రియ తదితర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.
తెలంగాణ నేతలపై చంద్రబాబు
'తెలంగాణలో పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇలాంటివి మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. విభజన జరిగి 12 ఏళ్లు అయ్యింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టలేరు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలు మాట్లాడుతున్నారు. నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేశాను. తమిళనాడుకు కర్నాటకతో సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారు... జాతీయ స్థాయి నేతలు వచ్చారు. కర్నాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పార్టీ శాఖను పెట్టారు. విస్తరిస్తాం అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ కాదు.' అని చంద్రబాబు అన్నారు.
అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో తెలుగువాళ్లు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లు పదవులు చేపడుతున్నారని, అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారన్నారు. ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో... వాళ్లు ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతున్నారని చెప్పారు. ప్రజల మధ్య విబేధాలు తేవటం సరికాదని, రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలన్నారు చంద్రబాబు. అనసవరంగా వివాదాలు సృష్టించటం ఎవరికీ మంచిది కాదన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


