...
...
Next Story

కృష్ణా జలాల్లో ఏపీ వాటా కోల్పోయే ప్రశ్నే లేదు - సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదీ జలాలపై ఏపీకి ఉన్న హక్కుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేశారు. తాజాగా అధికారులతో జరిపిన సమీక్షలో మాట్లాడుతూ… సంబంధిత ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలను వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

Published on: Nov 27, 2025, 14:54:53 IST
Advertisement

కృష్ణా జలాల్లో ఏపీ వాటా కోల్పోయే ప్రశ్నే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి నదీ జలాల వాటాను తీర్పు ఇచ్చే ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని పంపిణీ చేసినట్లు సీఎం తెలిపారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం ఏర్పాట్లు కొనసాగాలని… అన్ని జిల్లాలకు నీటి భద్రత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిజర్వాయర్లలోని నీటి వనరులను న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకూ వీలు లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చట్టపరంగా ఏపీకి దక్కిన వాటా యథాతథంగా కొనసాగించాల్సిందేనని… దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందన్న సీఎం చంద్రబాబు…. వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్ 25 నాటికి రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 1,095 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలమట్టం 7.3 మీటర్ల నుంచి తొమ్మిది మీటర్లకు మెరుగుపడిందని అధికారులు సీఎంకు వివరించారు. భూగర్భ జలమట్టాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వర్షాలు విస్తారంగా కురిసినా పలుచోట్ల జలాశయాలు ఇంకా పూర్తిస్థాయిలో నిండకపోవడానికి కారణాలపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భూగర్భజలాలు గతేడాది సగటున 7.45 మీటర్లు ఉండగా.. ఈ ఏడాది 6.8 మీటర్లకు పెరిగాయని వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks