వందేళ్ల కిందట కేటాయించిన నీటిని తెలంగాణ చెబితే కుదిస్తారా? : ఆంధ్రప్రదేశ్
దాదాపు శతాబ్దం పాటు ఏపీ చారిత్రాత్మకంగా వినియోగించుకున్న జలాలపై తెలంగాణ హక్కు కలిగి ఉండదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. మునుపటి ప్రకారం అనుమతించిన విధంగా మిగిలిన జలాలను ఉపయోగించుకుంటుందని తెలిపింది.
దాదాపు వందేళ్ల కిందట కేటాయించిన నీటిపై తెలంగాణ హక్కు కలిగి ఉండదని బుధవారం న్యూఢిల్లీలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II (KWDT-II) ముందు ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఏపీ పెట్టుబడుల పూర్తి విలువను తెలంగాణ వారసత్వంగా పొందిందని మాట్లాడింది. కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్న తెలంగాణ.. గోదావరి జలాల గురించి దాస్తోందని ఏపీ చెప్పింది. రెండు నదుల జలాలను కలిపి చూస్తే తెలంగాణకు నీటికి లోటే లేదని పేర్కొంది.

కృష్ణా జలాల పున:సమీక్షపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ సారథ్యంలోని కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్-2 విచారణలో రెండో రోజు కూడా ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా గట్టిగా వాదనలు వినిపించారు. నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్స్ ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు ఆస్కారం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఉందని జైదీప్ గుప్తా వాదించారు. అయితే తెలంగాణ సమర్పించిన ప్రతిపాదనలు.. ఏపీ నుండి కృష్ణా నీటిని మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఏపీ పంటల పద్ధతులను మార్చాలని లేదా ఐడీ పంటలకు మారాలని బలవంతం చేయాలని కోరుతున్నాయని ఆయన వాదించారు. ఇటువంటి ప్రతిపాదనలు ఏపీ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయని అన్నారు.
తెలంగాణ నదీ జలాల విషయంలో, ఆర్థికంగా సంపూర్ణ పరిపుష్టి కలిగి ఉందన్నారు జైదీప్. హైదరాబాద్ లో ప్రపంచ శ్రేణి ఐటీ కంపెనీలు ఉన్నాయన్నారు. తెలంగాణలో జిల్లాలన్నింటిలోనూ వ్యవసాయంతోపాటుగా పరిశ్రమలు ఉండటంతో ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. ఏపీకి రాజధాని లేదని, పరిశ్రమలు కూడా లేవని వాదించారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో తమకు ఉన్న నీటి కేటాయింపులు కూడా కుదిస్తే ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్తామన్నారు.
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగర్జున సాగర్‌లో గత కేటాయింపులను మార్చేందుకు వీల్లేదని జైదీప్ అన్నారు. సాగర్ జలాలు పూర్తిగా వ్యవసాయానికే వినియోగించాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందున్న ఉమ్మడి రిజర్వాయర్లకు కేటాయింపులు కుదించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.శ్రీశైలం, నాగర్జున సాగర్‌తోపాటుగా పులిచింతల కూడా ఉమ్మడి ప్రాజెక్టు పరిధిలోకి వస్తుందన్నారు.
మునుపటి ప్రకారం అనుమతించిన విధంగా మిగిలిన జలాలను ఉపయోగించుకోవడానికి ఏపీని అనుమతించాలని జైదీప్ అన్నారు. రాష్ట్రానికి అత్యల్ప నదీ తీరం ఉందని, కృష్ణా నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉందని పేర్కొన్నారు. గతంలో ట్రైబ్యునళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిలో కోత పెట్టడానికి వీల్లేదని ఈ సందర్భంగా ఏపీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 150 ఏళ్ల కిందటే సాగునీటి పారుదల విధానాలు నిర్దేశించారని పేర్కొంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


