పొట్టి శ్రీరాములుకు ఘన నివాళిగా అమరావతిలో పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విగ్రహ ఆవిష్కరణను చేశారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు ఆ ఉద్యమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారు. కొత్తగా ప్రతిష్టించిన ఈ విగ్రహం ఆయన చారిత్రక పోరాటాన్ని, ఆశయం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీస్థాయిలో నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశాయి.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక వ్యక్తిగా స్మరించే పొట్టి శ్రీరాములుకు ఘనమైన నివాళిగా ఈ విగ్రహం ఆవిష్కరించారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆశయ సాధనలో ఆయన చేసిన త్యాగం, ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది.
- 'అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాను. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిద్దాం!' నారా చంద్రబాబు నాయుడు
- ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికారు. సమాజంలో పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేశారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం. - నారా లోకేష్