అమరజీవి త్యాగశిల్పం : పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు.

Published on: Mar 16, 2026, 13:10:27 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళిగా అమరావతిలో పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విగ్రహ ఆవిష్కరణను చేశారు.

పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు ఆ ఉద్యమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారు. కొత్తగా ప్రతిష్టించిన ఈ విగ్రహం ఆయన చారిత్రక పోరాటాన్ని, ఆశయం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీస్థాయిలో నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశాయి.

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక వ్యక్తిగా స్మరించే పొట్టి శ్రీరాములుకు ఘనమైన నివాళిగా ఈ విగ్రహం ఆవిష్కరించారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆశయ సాధనలో ఆయన చేసిన త్యాగం, ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది.

  • 'అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాను. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిద్దాం!' నారా చంద్రబాబు నాయుడు
  • ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికారు. సమాజంలో పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేశారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం. - నారా లోకేష్
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More