ఏపీ : కానిస్టేబుల్స్ శిక్షణ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ - ఈనెల 16 నుంచి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎంతోకాలం ఎదురు చూస్తున్న శిక్షణకు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈ నెల 16 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు లాంఛనంగా శిక్షణ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ప్రకటన చేశారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర హోంశాఖ తీపికబురు చెప్పింది. ఎంతోకాలం ఎదురు చూస్తున్న శిక్షణకు సంబంధించి అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభమవుతుంది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.
ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్
హోం మంత్రి అనిత ప్రకటన…
“రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీ నుంచి లాంఛనంగా శిక్షణ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లోని పరేడ్ గ్రౌండ్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు” అని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు.
ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం ఏర్పాట్లను హోంమంత్రి అనిత ఇవాళ పరిశీలించారు. జరిగింది. డీఐజీ ఏసుబాబు , గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ , బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు కలిసి ఏర్పాట్లు పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈనెల 16వ తేదీన జరిగే కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు వారి కుటుంబసభ్యులతో హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ శిక్షణా కేంద్రాల్లో వారికి పోలీసు విధులకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ ఇస్తారు. ఇందులో శారీరక దారుఢ్యం, ఆయుధాల వాడకం, చట్టాలపై అవగాహన, ప్రజలతో వ్యవహరించే తీరు వంటివి ఉంటాయి. చట్టాల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తారు. ఈ శిక్షణ పూర్తి అయిన తర్వాత పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించి… పోస్టింగులు ఇస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసింగే. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత 5,551 మంది ఫిట్ ఫర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ దక్కించుకున్నారు. వీరికి రెండు దశల్లో 9 నెలల పాటూ శిక్షణ ఇస్తారు.
ఏపీలో కానిస్టేబుల్రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావొస్తోంది. పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించిన కూటమి సర్కార్… నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది.