తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేంనరేందర్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తుమ్మిడిహెట్టిని ఎంత ఎత్తున నిర్మించాలి.. ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే వీలుందని సమావేశంలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం కూడా జరిగిందన్నారు. 71.5 కి.మీ మేరకు కెనాల్ వర్క్ జరిగిందని అధికారులు వివరించారు.
150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుంటుందని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలన్నిటిని సద్వినియోగం చేసుకునేందుకు 150 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించాలని నిపుణులు సూచించారు.
గతెలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు అంగీకరించిందని, 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఉంటుందని మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో నీటిని తీసుకునే వీలుందని ఇంజనీరింగ్ నిపుణులు వెల్లడించారు.
ఈ బ్యారేజీ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలో మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగు నీటిని అందించవచ్చని, అలాగే తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు వీలుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.
{{/usCountry}}ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.
{{/usCountry}}తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాల్సిన అవసరం ఉన్నందున మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కిషన్ రెడ్డికి తెలంగాణ రైతుల తరఫున కూడా విజ్ఞప్తి చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలిసి చర్చించాలని కూడా అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వానలు పడేలోపు పనులు పూర్తి చేయాలని మరోసారి స్పష్టం చేశారు.