సముద్రంలో లగ్జరీ జర్నీ.. 11 అంతస్తుల భారీ నౌక, సూపర్ ఫీల్.. షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు

కాస్త మైండ్ రిలాక్స్ చేయాలనుకుంటున్నారా? కొత్త లోకంలో ప్రయాణించాలనుకుంటున్నారా? మీకోసం మంచి అవకాశం వచ్చింది. విశాఖ నుంచి కార్డేలియా క్రూయిజ్ మళ్లీ నడిచేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు చూడండి.

Published on: Jun 10, 2026, 16:42:50 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సరికొత్త లోకంలో విహరిస్తూ మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. విలాసవంతమైన నౌక ‘కార్డేలియా క్రూయిజ్’ (Cordelia Cruise) మళ్లీ పర్యాటకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ వేదికగా ఈ సముద్ర విహార యాత్రలు పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకుల కోసం ఈ లగ్జరీ షిప్ ప్రయాణ తేదీలు, ప్యాకేజీలు, టికెట్ ధరల వివరాలు.

కార్డేలియా క్రూయిజ్ ప్యాకేజీ వివరాలు
కార్డేలియా క్రూయిజ్ ప్యాకేజీ వివరాలు

జూన్ 22 నుంచి సాగర విహారం

ఈ ఏడాది సముద్ర విహార సీజన్ జూన్ 22 నుండి ప్రారంభమై జూలై 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పరిమిత కాలంలో విశాఖపట్నం - చెన్నై మధ్య ఈ భారీ నౌక ప్రయాణిస్తుంది. ఈ సీజన్‌లో వైజాగ్ నుండి చెన్నైకి నాలుగు సార్లు, అలాగే తిరుగు ప్రయాణంలో చెన్నై నుండి వైజాగ్‌కు నాలుగు సార్లు ఈ క్రూయిజ్ నడుస్తుంది. సాధారణంగా ఈ టూర్ ప్యాకేజీలు 3 రాత్రులు - 4 రోజులు (3 Nights / 4 Days) కాలపరిమితితో ఉంటాయి.

క్రూయిజ్ గురించి

విశాఖ తీరం నుంచి బయల్దేరే ఈ నౌక సముద్రం మీదుగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి మీదుగా చెన్నై చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సముద్రంపై తేలియాడే మినీ నగరం ఫీల్ ఉంటుంది. గతంలో 2022లో మొదటిసారిగా వైజాగ్-చెన్నై మధ్య ప్రయాణించిన ఈ నౌక, పర్యాటకుల నుంచి విశేష ఆదరణ పొందింది. 692 అడుగుల పొడవు ఉండే ఈ భారీ నౌకలో 11 అంతస్తులు, 796 విలాసవంతమైన క్యాబిన్లు ఉన్నాయి.

ఒకేసారి సుమారు 1,600 నుండి 2,000 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఈ క్రూయిజ్‌లో ప్రయాణమే కాకుండా వినోదానికి ఇక్కడ కొదవ లేదు. అంతర్జాతీయ స్థాయి థియేటర్లు, స్టాండప్ కామెడీ షోల కోసం ప్రత్యేక ఆడిటోరియం, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి. పిల్లల కోసం 'కార్డేలియా కిడ్స్ అకాడమీ', పెద్దల కోసం మోడ్రన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, క్యాసినో, 24 గంటల పాటు అందుబాటులో ఉండే సూపర్ మార్కెట్, గ్లోబల్ వంటకాలతో కూడిన రెస్టారెంట్లు ఇందులో కొలువుదీరాయి.

కార్డేలియా క్రూయిజ్ టికెట్ ధరలు

మీరు ఎంచుకునే గదుల (క్యాబిన్) కేటగిరీని బట్టి ధరలు మారుతుంటాయి. ఇందులో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటీరియర్ క్యాబిన్ల నుండి అత్యంత విలాసవంతమైన ఛైర్మన్ సూట్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఒకరికి (ఇంటీరియర్ క్యాబిన్) రూ. 22,000 నుండి రూ. 25,000 వరకు ఉంటుంది. 2 రాత్రుల ప్యాకేజ్ ఇద్దరికిరూ. 48,000 వరకు, 3 రాత్రుల ప్యాకేజ్ ఇద్దరికిరూ. 70,000 వరకు దొరుకుతుంది. బాల్కనీ, సూట్ రూమ్స్ డిమాండ్‌ను బట్టి (అల్ట్రా లగ్జరీ)రూ. 80,000 పైగా ఉంటుంది.

ఈ అద్భుతమైన సముద్ర ప్రయాణానికి సంబంధించిన టికెట్లు అన్ని ప్రముఖ గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెన్సీలలోనూ అందుబాటులో ఉంటాయని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ తెలిపింది. వేసవి ముగింపు వేళ ఫ్యామిలీతో కలిసి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీని సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే మీ టికెట్లను రిజర్వ్ చేసుకోండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More