...
...
Next Story

ఏపీ - తెలంగాణ : శివాలయాలకు పోటెత్తిన భక్తులు - శ్రీశైలంలో భారీగా రద్దీ

మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు రాక మొదలైంది. ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.

Published on: Feb 15, 2026, 09:47:49 IST
Advertisement

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ షురూ అయింది. ప్రధాన ఆలయాలతో పాటు మిగతా ఆలయాల్లో కూడా సందడి నెలకొంది.

శ్రీశైలం
శ్రీశైలం

ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కోటప్పకొండ వంటి క్షేత్రాలకు లక్షలాది మంది తరలివస్తున్నారు. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, కీసర, రామప్ప, వేయ్యి స్తంభాల గుడి, చెర్వుగట్టు వంటి ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలతో శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలంలో భారీగా రద్దీ…

ప్రస్తుతం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులోనూ ఇవాళ మహాశివరాత్రి పర్వ దినం కావటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తుల తరలివస్తున్నారు.దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

పాతాళగంగ వద్దకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. గంగాధర, నంది మండపం వద్ద కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీశైలం పురవీధుల్లో శివనామస్మరణం మార్మోమోగుతోంది.

ఇక శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా… ఇటీవలనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 16 వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద రుసుం మినహాయింపు ఇస్తోంది. శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రభుత్వం సూచిన చోట్ల ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆలయం, అటవీశాఖ టోల్‌గేట్ల దగ్గర టోల్ చెల్లించకుండానే వెళ్లొచ్చు.

గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు . ఇక సాధారణ సమయాల్లో రాత్రి సమయంలో శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించరు. బ్రహ్మోత్సవాల రద్దీ వేళ రాత్రివేళల్లో కూడా రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe