...
...
Next Story

రూఫ్ టాప్ సోలార్ పనులు వేగవంతం చేయాలి - సీఎస్ విజయానంద్

రూఫ్ టాప్ సోలార్ పనులు వేగవంతం చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.ఎం ఈ-డ్రైవ్ పథకం కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు.

Published on: Dec 7, 2025, 06:00:12 IST
Advertisement

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకంతో పాటు మరికొన్నింటిపై సమీక్షించారు.

ఎటువంటి జాప్యం ఉండొద్దు - సీఎస్

ఏపీ సీఎస్ సమీక్ష
ఏపీ సీఎస్ సమీక్ష

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ….. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 7.48 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు వచ్చే ఏడాది మార్చిలోగా ఫీజిబిలిటీ ఉన్న గృహాలపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 415 మెగావాట్ల సామర్థ్యంతో రూప్ టాప్ సోలార్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. సోలార్ ప్యానల్స్ ను అమర్చిన వెంటనే ఎటువంటి జాప్యం లేకుండా నెట్ మీటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎం కుసుమ్ పథకం కింద 610 మెగావాట్ల సామర్థ్యంతో 1.36 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ పనులను పూర్తి చేయాలన్నారు. ఫీడర్ సోలరైజేషన్ పథకం కింద అనంతపురం సర్కిల్ పరిధిలోని 20 ప్రాంతాల్లో 498 ఎకరాల ప్రాంగణంలో 111 మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకు సంబంధించి భూసేకరణను వేగవంతం చేయాలని అనంతపురం జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పీఎం సూర్యఘర్ పథకం కింద అనంతపురం జిల్లాలో 35.7 మెగావాట్ల సామర్థ్యంతో 17,870 గృహాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయాలని… ఈ పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో క్లిన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పవన విద్యుత్, సోలార్ విద్యుత్ లాంటి పర్యావరణ హిత విద్యుత్ ను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని సీఎస్ గుర్తు చేశారు. ఇందుకనుగుణంగా నిర్దేశిత గడువులోగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks