బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను(Cyclone Akvan) తీరాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ(IMD) అధికారికంగా ప్రకటించింది. రానున్న 3 లేదా 4 గంటల్లో ఇది పూర్తిగా తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. గత 6 గంటలుగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను, ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరాన్ని తాకనుంది.

వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. తీవ్ర తుపానుగా ఉన్న అక్వాన్ తీరానికి చేరువయ్యే క్రమంలో కాస్త బలహీనపడి తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి తూర్పుగా సుమారు 80 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం, గోపాల్‌పూర్‌లలోని డాప్లర్ వెదర్ రాడార్ల ద్వారా వాతావరణ శాఖ తుపాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గరిష్టంగా 90 కి.మీ వేగానికి చేరుకునే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో సోంపేట తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.
గడచిన కొన్ని గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్ఛాపురం-16.0 సెం.మీ, కంచిలి-10.0 సెం.మీ, కవిటి-10.0 సెం.మీ, పలాస 9.9-సెం.మీ, సోంపేట-9.2 సెం.మీ, వజ్రపుకొత్తూరు-4.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తుపాను గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటనుండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల నుండి సుమారు 3 లక్షల మందిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, అగ్నిమాపక దళాలతో కలిపి 423 సహాయక బృందాలను రంగంలోకి దించారు.
{{/usCountry}}తుపాను గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటనుండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల నుండి సుమారు 3 లక్షల మందిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించింది. ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, అగ్నిమాపక దళాలతో కలిపి 423 సహాయక బృందాలను రంగంలోకి దించారు.
{{/usCountry}}