నెమ్మదిగా కదులుతున్న 'దిత్వా' తుఫాన్ - కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన..!

'దిత్వా' తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కోస్తా, రాయలసీమలో రేపు,ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Published on: Nov 28, 2025, 15:35:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 4 కి.మీ వేగంతో తుఫాన్ ముందుకు సాగిందని వాతావరణశాఖ తెలిపింది. పుదుచ్చేరికి 420 కి.మీ., చెన్నైకి 520 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది.

'దిత్వా' తుఫాన్ ఎఫెక్ట్ - ఏపీకి భారీ వర్ష సూచన
'దిత్వా' తుఫాన్ ఎఫెక్ట్ - ఏపీకి భారీ వర్ష సూచన

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు తుఫాన్ చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

భారీ వర్షాలు….

ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు,ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణకు వర్ష సూచన:

తెలంగాణకు కూడా వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 29వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక డిసెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More