తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ నెల 29 నుంచి వర్షాలు..! పలు జిల్లాలకు హెచ్చరికలు

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 29వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 30వ తేదీన కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసంది.

Published on: Nov 27, 2025, 14:27:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 12 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

ఆ తర్వాత తదుపరి 48 గంటల్లో (నవంబర్ 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి) నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తా తీరం వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ మాత్రమే కాకుండా తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణలో మళ్లీ వర్షాలు…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం….నవంబర్ 29వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక డిసెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ పొడి వాతావరణం ఉంటుంది.

ఏపీలోనూ వర్షాలు….

ఇక ఏపీలో చూస్తే శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శని, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More