...
...
Next Story

బలహీనపడిన దిత్వా తుపాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు!

తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంట ఉత్తర దిశగా కదులుతున్న దిత్వా తుపాను బలహీనపడింది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉండనుంది.

Published on: Dec 1, 2025, 09:43:27 IST
Advertisement

దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలహీనపడుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిందని వాతావరణ శాఖ వెల్లడించింది. సుముద్రంలో అలజడి ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంట 44 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

దిత్వా తుపాను
దిత్వా తుపాను

భారత వాతావరణ శాఖ ప్రకారం దిత్వా తుపాను వల్ల డిసెంబర్ 1న తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో డిసెంబర్ 1, 2వ తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో డిసెంబర్ 1వ తేదీన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి. డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు తమిళనాడు, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో మెరుపులతో కూడిన పిడుగులు పడనున్నాయి.

సోమవారం నెల్లూరు, తిరుపతి, జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్సాఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవొచ్చు.

దిత్వా తుఫాను కారణంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నెల్లూరు జిల్లా యంత్రాంగం డిసెంబర్ 1, సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్‌వాడీ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా సెలవు ప్రకటిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు. భారీ వర్షం కారణంగా అన్నమయ్య జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. తిరుపతిలోనూ సెలవు ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks