ప్రయాణికులకు విజ్ఞప్తి.. మెుంథా తుపాను ప్రభావంతో ఈ తేదీ వరకు 43 రైళ్లు రద్దు!

మెుంథా తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. 43 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది.

Published on: Oct 27, 2025, 15:39:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావం ముదలైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణాలో వర్షాలు పడుతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలర్ట్ అయింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 43 రైళ్లను రద్దు చేశారు. అక్టోబర్ 27, 28, 29వ తేదీల్లో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను రద్దు చేస్తున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రద్దు చేసిన రైళ్ల జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణనికి ముందు రైలు స్టేటస్ చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తుపాను తీవ్రత ఆధారంగా కొన్నింటిని రద్దు, దారి మళ్లింపు చేస్తారు. ఇప్పటికే కాకినాడ తీరంలో తుపాను అలజడి ముదలైంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడనున్నాయి. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్రత పెరగనుంది. అక్టోబర్ 28న సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నంలో తుపాను తీరం దాటనుంది.

మొంథా తుపాను నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాకినాడ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ ఉండనున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు సెలవులు ప్రకటించారు. తుపాను దెబ్బకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులను మూసివేశారు. పలు ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు. అనవసరమైన ప్రయాణాలు చేయుద్దని అధికారులు హెచ్చరించారు.

తుపాను 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. మంగళవారానికి తీవ్ర తుపానుగా మారనుంది. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో తీరం వెంట ఈదురుగాలుల తీవ్రత పెరుగుతూ ఉంది. అనకాపల్లి జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. పర్యాటకులు ఎవరూ రావొద్దని అధికారులు హెచ్చరించారు.

మెుంథా తుపాను ప్రభావం ముదలై విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జలాశయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More