మెుంథా తుపానుతో భారీ వర్షాలు.. విమానాలు, రైళ్లు రద్దు.. తెలుసుకోవాల్సిన 10 పాయింట్స్!

తీవ్రమైన తుపానుగా మారిన మెుంథా ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. తీరం వైపు దూసుకొస్తున్న కొద్దీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.

Published on: Oct 28, 2025, 14:24:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తీవ్రమైన తుపానుగా మారిన మొంథ అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా. భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మెుంథా తుపాను గురించి తెలుసుకోవాల్సి 10 విషయాలు చూద్దాం..

మెుంథా తుపాను
మెుంథా తుపాను
  • ఈరోజు తీరం దాటే అవకాశం: మెుంథా తుపాను అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కాకినాడ మధ్యం తీరం దాటనుంది.
  • తీవ్రమైన తుపాను : IMD ప్రకారం, తుఫాను అక్టోబర్ 28న ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
  • భారీ వర్ష హెచ్చరిక: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే వర్షాలు ముదలు అయ్యాయి. రేపటి వరకు అతి భారీ వర్షాలు పడనున్నాయి.
  • తుపాను హెచ్చరిక: సముద్రంలో అలల 1 మీటరు కంటే ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఉప్పెన వచ్చే అవకాశం ఉంది, దీని వలన ఆంధ్రప్రదేశ్ తీరం, యానాం ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు వరదలకు గురవుతాయి.
  • పునరావాస కేంద్రాలు : అధికారులు లోతట్టు తీర ప్రాంతాల నుండి నివాసితులను తరలిస్తున్నారు. దాదాపు 50,000 మంది వ్యక్తులను సహాయ శిబిరాలకు తరలించారు. 2194 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
  • పాఠశాలలకు సెలవు : ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో కాలేజీ, పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు.
  • రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కోనసీమ వంటి అనేక జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్‌లు జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.
  • ఇతర రాష్ట్రాలపై ప్రభావం : ఒడిశా, తమిళనాడు, తెలంగాణ కూడా తుపాను ప్రభావాన్ని చూస్తున్నాయి. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
  • విమానాలు, రైళ్లు రద్దు : మెుంథా తుపాను కారణంగా ఏపీకి రావాల్సిన 18 విమానాలు రద్దు చేశారు. తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మంగళ, బుధవారాల్లో 107 రైళ్లను రద్దు చేసింది.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైనప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు.

తుపాను ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడం, సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి వివిధ చర్యలను ప్రారంభించింది. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, తీరప్రాంత నివాసితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More