తీరాన్ని తాకిన ‘మొంథా’ తీవ్ర తుపాన్ - తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, కొనసాగుతున్న హెచ్చరికలు…!
మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని ఐఎండీ తెలిపింది.
మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలినట్లు ఐఎండీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పట్టొచ్చని అంచనా వేసింది.

కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
బుధవారం(అక్టోబర్ 29) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడొచ్చు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడుతాయి. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుసే సూచనలున్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో 38 వేల హెక్టార్లలో పంటలు, 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు ధ్వంసమయ్యాయి. దాదాపు 76,000 మందిని సహాయ శిబిరాలకు తరలించగా, ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.
తుఫాను ప్రభావిత కృష్ణా, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఇవాళ రాత్రి 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడిచే మొత్తం 32 విమానాలను మంగళవారం రద్దు చేశారు. విజయవాడ విమానాశ్రయం 16 విమానాలు రద్దయ్యాయి.
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను అక్టోబర్ ౩౦ వరకు మూసివేస్తున్నట్లు పరిపాలన ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను కూడా అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు. పరిస్థితులను బట్టి కొన్ని జిల్లాల్లో సెలవును పొడిగించే అవకాశం ఉంది.
సీఎం చంద్రబాబు సమీక్ష…
తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. అధికారులకు సూచనలిస్తున్నారు. ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలాని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫోన్ చేశారు. తుఫాను పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

