...
...
Next Story

తప్పిన సెన్యార్ తుపాను ముప్పు.. 29 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు!

సెన్యార్ తుపాను ముప్పు తప్పింది. కానీ కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందవి వాతావరణ శాఖ అంచనా వేసింది.

Published on: Nov 27, 2025, 06:03:54 IST
Advertisement

మలక్కా జలసంధి, ఇండోనేషియా సమీపంలోని తీవ్ర వాయుగుండం సెన్యార్ తుపానుగా బలపడింది. అయితే ఇది పశ్చిమ దిశగా కదులుతూ తక్కువ సమయంలోనే ఇండోనేషియాలో తీరం దాటింది. దీని ప్రభావం మనకు ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణ, ఏపీ వర్షాలు
తెలంగాణ, ఏపీ వర్షాలు

అండమాన్ అండ్ నికోబార్ దీవులు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కేరళ, మాహేలలో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వైపు కదులుతూ.. మరింత బలపడనున్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ప్రధానంగా తమిళనాడును ప్రభావితం చేస్తుంది. నవంబర్ డిసెంబర్ 1 వరకు ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 29, 30 తేదీలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 29 నుంచి 30 తేదీలలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 26న కేరళ, మాహేలో భారీ వర్షాలు కురవనున్నాయి. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా.

శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదివారం నాడు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాలతోపాటుగా యానాంలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వేగంగా గాలులు వీస్తాయని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe