...
...
Next Story

వేట్లపాలెం ఘటన : 22కి చేరిన మృతుల సంఖ్య - మరో ఐదుగురి పరిస్థితి సీరియస్...!

కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగానే ఉందని జిల్లా అధికారులు తెలిపారు.

Published on: Mar 2, 2026, 13:22:20 IST
Advertisement

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగుతోంది.ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత మరోకరు ప్రాణం కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22కి చేరింది.

మరో ఐదుగురి పరిస్థితి సీరియస్….

పేలుడు జరిగిన ప్రాంతం
పేలుడు జరిగిన ప్రాంతం

క్రాకర్ యూనిట్ పేలుడులో మృతుల సంఖ్య 22కు చేరినట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఒకరు మృతి చెందారని… మృతుల సంఖ్య 22కు పెరిగిందని కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జే నరసింహా నాయక్ తెలిపారు. ప్రస్తుతం… నాలుగు నుంచి ఐదుగురి పరిస్థితి విషయంగానే ఉందని పేర్కొన్నారు. వీటిలో కొందరికి 90 శాతం వరకు కాలిన గాయాలతో ఉన్నాయని వివరించారు.

ప్రస్తుతం క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో…. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన చెక్కులను కూడా అధికారులు బాధిత కుటుంబాలకు అందించారు. సామర్లకోటకు చెందిన దర్శిపాటి నాని(38), ఏడిద సంపత్ కుమార్(25), జి.మేడపాడు గ్రామానికి చెందిన గంపల మంగ(43), గంపల నాగరాజు(45), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని(44), గొడత మహేష్(41), గొడత వీరవెంకట రమణ(48), కడింపల్లి ధనరాజు(55), పెదబ్రహ్మదేవంకి చెందిన మకర రాఘవమ్మ(55) ల కుటుంబసభ్యులకు వీటిని అందించారు.

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలంలోని వేట్లపాలెం బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.

సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 15 మందికిపైగా కార్మికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో 35 మంది వరకు కార్మికులు పని చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొందరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks