వేట్లపాలెం పేలుడు ఘటన : 21కి చేరిన మృతుల సంఖ్య - ఇంకా పెరిగే ఛాన్స్..!

Cracker unit blast here in Kakinada : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం పేలుడు ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి మరోకరు చనిపోవటంతో… ఈ ఘటనలో  మృతుల సంఖ్య 21కి చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Published on: Mar 1, 2026, 11:51:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. శనివారం నాటికి 20 మంది చనిపోగా…. అర్ధరాత్రి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 21కి చేరింది.

పేలుడు జరిగిన ప్రాంతం
పేలుడు జరిగిన ప్రాంతం

మృతుల సంఖ్య పెరిగే అవకాశం….

తీవ్ర గాయాలపాలైన వారికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌)లో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. చాలా మందికి 70 శాతానికిపైగా కాలిన గాయాలు ఉండటంతో… మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరణాల సంఖ్య 21 గా ఉందని… అర్ధరాత్రి తర్వాత ఒకరు చనిపోయారని ఓ అధికారులు వెల్లడించారు. మృతుల్లో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల శ్రీనివాస్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన కుమారుడు అడబాలు అర్జున్ కూడా గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనకు కారణమైన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఘటనపై విచారణ జరుపుతామని దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామని సీఎం చంద్రబాబు కూడా హెచ్చరించారు.

ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల్ల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

‘ కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ప్రకటిస్తున్నా’ అని ఎక్స్‌లో ప్రధానమంత్రి మోదీ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More