HPV Vaccination : దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్‌ - ప్రారంభించిన ప్రధాని మోదీ, ఎక్కడెక్కడ వేస్తారంటే..?

దేశంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. రాజస్థాన్ లో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ వాక్సినేషన్ల ప్రక్రియ షురూ అయింది.

Published on: Feb 28, 2026, 12:17:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. శనివారం రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

HPV వ్యాక్సినేషన్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ
HPV వ్యాక్సినేషన్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ

14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ అందిస్తారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అరికట్టేందుకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా బాలికలకు HPV వ్యాక్సినేషన్ ఇస్తారు. 3 నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దేశవ్యాప్తంగా కోటీ 15 లక్షల మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరోవైపు తెలంగాణలోనూ ఈ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే నేటి నుంచి నెల రోజుల వరకూ ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తారు. అంటే మొత్తం 3 నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది.

HPV వ్యాక్సినేషన్‌ - ముఖ్యమైన వివరాలు:

  • హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ను నుండి రక్షణను అందించేందుకు సాయపడుతుంది. పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ నుంచి అమ్మాయిలను కాపాడేందుకు ఈ చర్య ముఖ్యమని ఆరోగ్య అధికారులు తెలిపారు.
  • బయట ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. సాధారణంగా మోతాదుకు రూ.6,000-రూ.12,000 మధ్య ఖర్చవుతుంది. కానీ కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నాయి.
  • 15 ఏళ్ల వయసున్న అమ్మాయిల తల్లిదండ్రులు తప్పకుండా ఈ విషయంపై అలర్ట్‌గా ఉండాలి. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించనుంది.
  • సుమారు 85 నుంచి 90 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు హెచ్‌పీవీ వల్లే వస్తాయి. 14-15 ఏళ్ల వయసులో వేయిస్తే ఉత్తమ రక్షణ లభిస్తుందని ఆరోగ్య నివేదికలు సూచిసున్నాయి.

రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు…

అర్హులైన బాలికల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'యూ-విన్' (U-WIN) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేసి, తమకు దగ్గరలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

వ్యాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు నమ్మవద్దని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇది సురక్షితమైన మరియు శాస్త్రీయంగా నిరూపితమైన టీకా అని చెబుతున్నారు. ఇంట్లోనే పిల్లలకు వెంటనే వేయించండి పేర్కొంటున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More