...
...
Next Story

పైప్డ్ గ్యాస్‌పై కొత్త పాలసీ తీసుకువచ్చేలా త్వరలో నిర్ణయం : మంత్రి నాదెండ్ల మనోహర్

LPG : ఏపీలో ఎక్కడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందకూడదని విజ్ఞప్తి చేశారు.

Published on: Mar 25, 2026, 18:31:51 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా బుకింగ్ లు చేస్తున్నారని తెలిపారు. పైప్డ్ గ్యాస్ కొత్త పాలసీ తీసుకువచ్చేలా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని గుర్తుచేశారు.

మంత్రి నాదెండ్ల మనోహర్
మంత్రి నాదెండ్ల మనోహర్

రెస్టరెంట్లు, విద్యాసంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో జనాలు పైప్డ్ గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు చేయకుండా.. ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. అక్రమాలపై 800 కేసులు నమోదు చేశామని, 3540 సిలిండర్లను సీజ్ చేసినట్టుగా చెప్పారు.

'బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా గ్యాస్ సరఫరా జరపాలి. అర్హత లేని వారి చేతుల్లోకి సిలిండర్లు వెళ్లకుండా చూసుకునే బాధ్యత మా మీదనే ఉంది. పట్టణాల్లో వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తాం.' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ కొరత హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే తినుబండారాల కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో చాలా వరకు మూతపడగా, మరికొన్ని ధరలు పెంచి, మెనూను కుదించాయి. ఎల్‌పీజీ కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాణిజ్య సిలిండర్లపై ఆధారపడిన వ్యాపార యజమానులు తీవ్రమైన సరఫరా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఒకప్పుడు రద్దీగా ఉండే వీధుల్లో సర్వసాధారణంగా కనిపించే రోడ్డు పక్కన ఆహార విక్రయదారులు గ్యాస్ కొరత కారణంగా క్రమంగా కనిపించడం లేదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks