కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్డీయే ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఏపీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలందరూ తప్పనిసరిగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోవాలని, సభలో పూర్తి స్థాయి హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే ఈ రెండు బిల్లులు దేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచిపోతాయని చంద్రబాబు అభివర్ణించారు. ఇలాంటి చారిత్రాత్మక చట్టాల రూపకల్పన ప్రక్రియలో రాష్ట్ర ఎంపీలందరూ అత్యంత చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో దృఢ సంకల్పంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకెళ్తున్నారని చంద్రబాబు కొనియాడారు. చట్టసభల్లో మహిళల శక్తిని చాటిచెప్పే ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్లు చర్చకు వచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా ప్రతినిధులు సభలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలందరూ పూర్తి సమన్వయంతో పనిచేయాలని, ఒక్క సభ్యుడు కూడా సభకు గైర్హాజరు కాకుండా జాగ్రత్త వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎన్డీయే నాయకత్వం జారీ చేసే ప్రతి ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటించాలని సూచించారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయంటూ జరుగుతున్న ప్రచారంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు 50 శాతం మేర సీట్లు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఏ ఒక్క రాష్ట్రానికీ నష్టం వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచే ఈ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాలని కోరారు.
{{/usCountry}}ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు 50 శాతం మేర సీట్లు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల ఏ ఒక్క రాష్ట్రానికీ నష్టం వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచే ఈ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, సమాజంలోని అన్ని వర్గాలు స్వాగతించాలని కోరారు.
{{/usCountry}}ఈ బిల్లుల విషయంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరిలో వస్తున్న మార్పును చంద్రబాబు ప్రస్తావించారు. గతంలో ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించిన పార్టీలు సైతం ఇప్పుడు మద్దతుగా నిలవడం ప్రజాస్వామ్యంలో ఒక సానుకూల పరిణామమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు ఏపీ ఎన్డీయే ఎంపీలందరూ సంపూర్ణ మద్దతు తెలపాలని సూచించారు.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.