పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగుల బెడదపై ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో… అటవీ శాఖ అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. జిల్లా వాసులకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో, పలమనేరులోని ముసలమడుగు క్యాంపు నుంచి రెండు ప్రత్యేక కుంకీ ఏనుగులను మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించనున్నారు.

రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో సుదీర్ఘకాలం ప్రత్యేక శిక్షణ పొందిన 'జయంత్' అనే కుంకీ ఏనుగుతో పాటు, కర్ణాటక నుంచి తీసుకువచ్చిన 'అభిమన్యు' అనే మరో కుంకీని మన్యం జిల్లాకు పంపాలని ఉప ముఖ్యమంత్రి అటవీ అధికారులను ఆదేశించారు. మానవ-ఏనుగుల మధ్య జరిగే సంఘర్షణలను సమర్థవంతంగా అరికట్టడంలో ఈ రెండూ అత్యంత అనుభవం కలిగినవిగా పేరుగాంచాయి.
ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్‌లు అత్యంత సంక్లిష్టమైన ఆరు మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాయి. ముఖ్యంగా ఇటీవల పలమనేరు సమీపంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసిన ఒంటరి మగ అడవి ఏనుగును బంధించే ఆపరేషన్‌లో ఈ రెండు కుంకీలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. వీటి మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం, ఆపరేషన్లలో ప్రతిభను ప్రాతిపదికగా తీసుకునే అటవీ శాఖ వీటిని ఎంపిక చేసింది.
అసలు సమస్య ఇదే!
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి తరచూ అడవి ఏనుగుల గుంపులు రాకపోకలు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతాల ఆవరణ విస్తీర్ణం తగ్గడం, అడవుల విభజన, నీరు మరియు ఆహారం కొరత ఏర్పడటం వల్ల ఏనుగులు సరిహద్దులు దాటి మన్యం జిల్లాలోని గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పొలాల్లోకి వచ్చి పంటలను తీవ్రంగా నాశనం చేయడంతో పాటు గృహాలపైనా, గ్రామాలపైనా పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానిక రైతులు, గిరిజనులు నిత్యం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు.
మన్యం జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఒడిశా ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో చర్చలు జరపాలని, ఏనుగులను తిరిగి స్వస్థలాలకు మళ్లించే చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఒడిశా నుంచి మరికొన్ని కుంకీ ఏనుగులను కూడా తీసుకురావాలని భావిస్తున్నారు.
{{/usCountry}}మన్యం జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఒడిశా ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో చర్చలు జరపాలని, ఏనుగులను తిరిగి స్వస్థలాలకు మళ్లించే చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఒడిశా నుంచి మరికొన్ని కుంకీ ఏనుగులను కూడా తీసుకురావాలని భావిస్తున్నారు.
{{/usCountry}}అయితే…. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా ముందుగా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న జయంత్, అభిమన్యులను గుచ్చిమి క్యాంపునకు తరలిస్తున్నారు. ఈ రెండు కుంకీ ఏనుగుల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో అడవి ఏనుగులను అడవుల్లోకి తోలివేసేలా చర్యలు చేపడతారు.ఇవే కాకుండా సమస్య తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సమగ్ర భద్రతా చర్యలను అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
- ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా సౌర కంచెల (Solar Fencing) నిర్మాణం
- ఏనుగులను నిరోధించడానికి వీలుగా అటవీ సరిహద్దుల్లో పెద్ద కందకాలు తవ్వడం
- అటవీ అంతర్భాగంలోనే నీటి వనరులను అభివృద్ధి చేయడం
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా ఏర్పాటు
- అత్యవసర స్పందన కోసం 'హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్' బృందాలను రంగంలోకి దించడం
- ఏనుగుల కదలికలపై గ్రామాల్లో ప్రజలకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం