బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల కాలంలో తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం నాటికి ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

వాయుగుండం తీరం వైపు పయనిస్తున్న కొద్దీ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లా్ల్లో కూడా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది.
{{/usCountry}}రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వెదర్ మ్యాన్ అంచనా వేశారు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటుగా ఉత్తర తెలంగాణ జిల్లా్ల్లో కూడా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉంది.
{{/usCountry}}హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడ చినుకులు లేదా మోస్తరు వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణాలు చేసే వారు, లోతట్టు ప్రాంతాల నివాసితులు వాతావరణ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.