యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పని చేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పని చేయిస్తుండడం దారుణమన్నారు.
నిబంధనలు కఠినతరం చేస్తాం - డిప్యూటీ సీఎం పవన్

భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సామర్లకోట మండలం, వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారని తెలిపారు.
“ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చే ముందు సీఎంతో చర్చించాం. నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించాం. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాం. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చుల ప్రభుత్వమే భరిస్తుంది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
20 మంది మృతి…
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న మరో 9 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.
{{/usCountry}}కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న మరో 9 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.
{{/usCountry}}పేలుళ్ల ధాటికి అందులో పనిచేస్తున్న కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. పచ్చిన పొలాల మధ్య జరిగిన ఈ భీకరమైన పేలుడు… తీవ్ర శోకాన్ని మిగిల్చాయి. ఓ దశలో చనిపోయిందెవరో గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.