వైద్య సేవల్లో ఏఐ (కృత్రిమ మేధస్సు) వినియోగాన్ని కూటమి ప్రభుత్వం క్రమంగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మదుమేహంతో కంటి చూపు సమస్యలు (రెటినోపతి) కలిగిన వారికి తగిన సమయంలో చికిత్స అందించడంలో ఏఐ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫండస్ కెమెరాల ద్వారా తీసే ఇమేజ్ ను పరిశీలించి, రెటినోపతి సమస్య ఎంత తీవ్రంగా ఉంది? వైద్యులను సంప్రదించాలా? వద్దా? అన్న దానిపై ఏఐ స్పష్టత ఇస్తుంది.

ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే ఫండస్ కెమెరాలు ఉన్నాయి. ఏఐ సేవల రాకతో ఫండస్ కెమెరాలు, అష్టోమెట్రిస్ట్ (టెక్నిషియన్)లను అందుబాటులోనికి తీసుకువస్తే సరిపోతుంది. రెటినోపతి సమస్యలు గుర్తించడంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఏఐ సాయపడుతుంది. ఇప్పటికే నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ప్రత్యేకంగా రూపొందించిన య పన్ను ఉపయోగించడంపై ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు ద్వారా పరీక్షలు చేస్తోంది. ఇటీవల మెడ్ టెక్ ఛాలెంజ్ ద్వారా 18 ఆసుపత్రుల్లో 18 అంకుర సంస్థలు వైద్య సేవలు అందించింది. ఇదే క్రమంలో కంటి వైద్యంలోనూ ఏఐ సేవలను వినియోగించేందుకు వీలుగా పైలట్ ప్రాజెక్టు కింద మూడు ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఫండస్ కెమెరాలు ఉన్నచోట్ల మాత్రమే ఇమేజ్ ఆధారంగా రెటీనా కంటి వైద్యులు సదరు రోగుల కంటి చూపు పరిస్థితిని నిర్ధారించుకుని చికిత్స అందిస్తున్నారు. ఫండ్స్ కెమెరా లేకున్నా... డాక్టర్ లేకున్నా రెటినోపతి ట్రీట్మెంట్ జరగదు. అయితే కంటి వైద్యులు లేకున్నా ఇమేజ్ ఆధారంగా ఏఐ ఇచ్చే రిపోర్టు ఆధారంగా అప్టోమేట్రిస్ట్ (స్క్రీనింగ్ చేసే వారు) తదుపరి చికిత్స అవసరం ఏ స్థాయిలో అవసరమో గుర్తించి, రోగులను అప్రమత్తం చేయడానికి వీలు ఏర్పడుతుంది.
ఇప్పుడు ఈ అవకాశం లేనందున రెటినోపతి సమస్యలు ముదిరిన అనంతరం రోగులు వైద్యుల వద్దకు వెళ్లేసరికి, పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి. మదుమేహంతో ఉన్నవారిలో సగటున 20 శాతం మందిలో కంటి చూపు మందగించడం, నరం దెబ్బతినడం, రెటీనా పొర విడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
{{/usCountry}}ఇప్పుడు ఈ అవకాశం లేనందున రెటినోపతి సమస్యలు ముదిరిన అనంతరం రోగులు వైద్యుల వద్దకు వెళ్లేసరికి, పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి. మదుమేహంతో ఉన్నవారిలో సగటున 20 శాతం మందిలో కంటి చూపు మందగించడం, నరం దెబ్బతినడం, రెటీనా పొర విడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
{{/usCountry}}గుంటూరులోని బోధనాసుపత్రికి నెలకు 3వేల మంది వస్తుండగా 15 శాతం నుంచి 20 శాతం మంది రెటినోపతి సమస్యలతో ఉంటున్నారని గుర్తించారు. గుంటూరు జీజీహెచ్ మదుమేహ వ్యాధిగ్రస్తులను ఏఐ ద్వారా పరీక్షించడం ప్రారంభించారు. ఇదేవిధంగా కర్నూలులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ నెల 13న, విశాఖలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఈ నెల 16న రోగులను పరీక్షించనున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎయిమ్స్, ఎయిమ్స్-రిషికేశ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి వాద్వాని (ఎన్జీఓ సంస్థ) 'మధునేత్ర' ఏఐ సొల్యూషన్ రూపొందించింది. ఈ రెండు సంస్థల్లో సుమారు 13వేల మంది రెటినోపతి సమస్యలు కలిగిన వారిని పరీక్షించారు. వీటి ఫలితాలు అనుసరించి ఎయిమ్స్-బీబీనగర్, ఎయిమ్స్ రాయ్‌పూర్ ప్రస్తుతం మదుమేహ వ్యాధిగ్రస్తులను పరీక్షిస్తున్నారు. వీటితోపాటు దేశంలోని రాజస్థాన్, అసోం, చత్తీస్‌ఘడ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, బీహార్, ఇతరచోట్ల కలిపి 45 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏఐ ఆధారిత సేవలను 'వాద్వాని' అందిస్తోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 3 చోట్ల మదుమేహ రోగులకు రెటినోపతి సమస్యలను పరీక్షించాలని నిర్ణయించింది. మూడునెలలపాటు వీటిల్లో పరీక్షలు జరగనున్నాయి.