అడవితల్లి బాట 2.0లో రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ రహదారుల అభివృద్ధి

అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధి చేసింది ఏపీ ప్రభుత్వం. అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ రహదారుల అభివృద్ధి చేయనుంది.

Published on: Aug 9, 2026, 06:06:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో డోలీరహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా చేపట్టిన అడవితల్లి బాట పనులు పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవితల్లిబాట 2.0ను ప్రారంభించారు.

అడవితల్లి బాట
అడవితల్లి బాట

ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టును రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి విస్తరించడం జరిగింది. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తైంది. అడవితల్లిబాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ సూచనలు చేస్తున్నారు.

అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకు రోడ్డు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి, రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారిపై రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నారు.

అడవితల్లిబాట పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని పవన్ స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను చేరువ చేయాలన్న బలమైన సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో చేపట్టిన అడవితల్లి బాట పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More