...
...
Next Story

భక్తుడి పెద్ద మనసు - తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 9 కోట్ల విరాళం

టీటీడీ మరో భారీ విరాళం వచ్చింది. మంతెన రామలింగ రాజు అనే భక్తుడు ఏకంగా రూ. 9 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునీకరణ కోసం ఈ విరాళాన్ని ఉపయోగించనున్నారు.

Published on: Nov 26, 2025, 12:52:41 IST
Advertisement

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తరలివస్తారు. వెంకటేశ్వరస్వామి కోసం మొక్కులు చెల్లింస్తుంటారు. కొందరు భక్తులు బంగారం, వెండి, నగదు ఇలా వారికి తోచిన విధంగా స్వామికి కానుకలు ఇస్తుంటారు. అలాగే కొందరు భక్తులు స్వామివారికి భారీ విరాళాలు కూడా ఇస్తుంటారు. ఇటీవలే కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఓ భక్తుడు ఏకంగా రూ. 9 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం మీడియాకు వెల్లడించారు.

2012 లోనూ విరాళం….

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

పీఏసీ 1, 2 3 భవనాల అధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు అనే భక్తుడు రూ.9 కోట్లు విరాళం అందజేశారు. ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట దీన్ని ఇచ్చారు.ఇదే భక్తుడు 2012లో కూడా టీటీడీకి రూ.16 కోట్లు విరాళమిచ్చారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గుర్తు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం చూపిన ఈ సేవాభావానికి టీటీడీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. స్వామి వారి అనుగ్రహం ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో కూడా ఇలానే ఆధ్యాత్మిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు.

మరోవైపు ఇటీవలనే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని కోరింది. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, savetemples.org పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు నవంబర్ 29న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది.

మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.ఈ విధమైన అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe