సాంకేతికత, సృజనాత్మకత ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్, ప్రముఖ గ్లోబల్ డిజైనింగ్ ప్లాట్‌ఫారమ్ 'కాన్వా' (Canva) మధ్య కుదిరిన అధికారిక భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు రాష్ట్రవ్యాప్తంగా ‘కాన్వా ఫర్ ఎడ్యుకేషన్’ (Canva for Education) ఉచిత యాక్సెస్‌ను కల్పించిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది.

డిజిటల్ లెర్నింగ్, ఫ్యూచర్-రెడీ ఎడ్యుకేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ప్రభుత్వ సంకల్పంలో ఈ చొరవ మరొక మైలురాయిగా నిలిచింది.
సాంకేతిక అనుకూలతలకు లోబడి, ఈ కాన్వా ప్లాట్‌ఫారమ్‌ను ఏపీ ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ యాప్ అయిన ‘లీప్’ (LEAP - Learning Excellence in AP) తో పాటు, గూగుల్ వర్క్‌స్పేస్, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న క్రోమ్‌బుక్స్ లతో అనుసంధానం చేయనున్నారు. ఇది తరగతి గదుల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారికి అతుకులు లేని డిజిటల్ అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది.
అంతేకాకుండా ఈ కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల బాధ్యతాయుతమైన, సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఉపాధ్యాయులు సురక్షితమైన అభ్యాసంతోపాటు సరికొత్త సాంకేతికతలను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'భవిష్యత్తు అనేది సృజనాత్మకంగా ఆలోచించగల, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల, పూర్తి ఆత్మవిశ్వాసంతో సాంకేతికతను ఉపయోగించుకోగల వారిదే. ఈ భాగస్వామ్యం ద్వారా, ఒకప్పుడు కేవలం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి డిజిటల్ టూల్స్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉచితంగా అందించి వారిని సాధికారత వైపు నడిపిస్తున్నాం.' అని అన్నారు.
కేవలం సాంకేతికతను ఉపయోగించే వినియోగదారులను తయారు చేయడం మాత్రమే మా విజన్ కాదు; రేపటి తరం సృష్టికర్తలను, ఆవిష్కర్తలను, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే గ్లోబల్ లీడర్లను తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశపు నాలెడ్జ్, ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా మార్చే ప్రయాణంలో ఈ సరికొత్త నిర్ణయం మరొక బలమైన అడుగు అని పేర్కొన్నారు.
{{/usCountry}}కేవలం సాంకేతికతను ఉపయోగించే వినియోగదారులను తయారు చేయడం మాత్రమే మా విజన్ కాదు; రేపటి తరం సృష్టికర్తలను, ఆవిష్కర్తలను, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే గ్లోబల్ లీడర్లను తయారు చేయడమే మా ప్రధాన లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశపు నాలెడ్జ్, ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా మార్చే ప్రయాణంలో ఈ సరికొత్త నిర్ణయం మరొక బలమైన అడుగు అని పేర్కొన్నారు.
{{/usCountry}}డిజిటల్, కమ్యూనికేషన్, డిజైన్-థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంపొందించాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. విద్యార్థులు కాన్వా టూల్స్ ఉపయోగించి ప్రజెంటేషన్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు, గ్రాఫిక్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కంటెంట్ రూపొందించుకోవచ్చు.