ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అనేక తీరప్రాంత జిల్లాల్లో మెుంథా తుపాను ప్రభావం కారణంగా డిప్లొమాకు సంబంధించి సప్లీమెంటరీ పరీక్షలు వాయిదా వేశారు. సి-16, సి-20 స్కీమ్స్ కింద డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు (SBTET) ఆంధ్రప్రదేశ్ వాయిదా వేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను సాంకేతిక విద్యా డైరెక్టర్ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత సవరించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ తమ విద్యార్థులకు వాయిదా గురించి తెలియజేయాలని ఆదేశించారు. కొత్త పరీక్ష తేదీల అప్డేట్స్ కోసం విద్యార్థులు apsbtet.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో కావాలి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బోర్డు తెలిపింది. పరీక్షలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఇలా చేసినట్టుగా తెలిపింది. అప్డేట్ చేసిన షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనుంది.
విద్యాసంస్థలకు సెలవు
మెుంథా తుపానుతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ నెల 27 నుంచి రెండురోజులపాటు సెలవు ఇచ్చారు. సీఎం చంద్రబాబ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఈ నెల 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితుల ఆధారంగా తర్వాత కూడా సెలవులు పొడిగించే అవకాశం ఉంది.
మరోవైపు అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. విద్యా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కడప అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో సెలవులు ఇచ్చారు. బాపట్ల, గుంటూరు సెలవులు ఇవ్వగా.. కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలో ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
{{/usCountry}}మరోవైపు అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. విద్యా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కడప అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో సెలవులు ఇచ్చారు. బాపట్ల, గుంటూరు సెలవులు ఇవ్వగా.. కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలో ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
{{/usCountry}}మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.