మెుంథా తుపాను ఎఫెక్ట్.. ఏపీలో డిప్లొమా పరీక్షలు వాయిదా!

ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను కారణంగా డిప్లొమా సప్లీమెంటరీకి సంబంధించిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు కొత్త షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నారు.

Published on: Oct 26, 2025, 21:54:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అనేక తీరప్రాంత జిల్లాల్లో మెుంథా తుపాను ప్రభావం కారణంగా డిప్లొమాకు సంబంధించి సప్లీమెంటరీ పరీక్షలు వాయిదా వేశారు. సి-16, సి-20 స్కీమ్స్ కింద డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు (SBTET) ఆంధ్రప్రదేశ్ వాయిదా వేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను సాంకేతిక విద్యా డైరెక్టర్ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత సవరించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

ఏపీ డిప్లొమా పరీక్షలు వాయిదా
ఏపీ డిప్లొమా పరీక్షలు వాయిదా

ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ తమ విద్యార్థులకు వాయిదా గురించి తెలియజేయాలని ఆదేశించారు. కొత్త పరీక్ష తేదీల అప్డేట్స్ కోసం విద్యార్థులు apsbtet.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో కావాలి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బోర్డు తెలిపింది. పరీక్షలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఇలా చేసినట్టుగా తెలిపింది. అప్డేట్ చేసిన షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనుంది.

విద్యాసంస్థలకు సెలవు

మెుంథా తుపానుతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ నెల 27 నుంచి రెండురోజులపాటు సెలవు ఇచ్చారు. సీఎం చంద్రబాబ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఈ నెల 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితుల ఆధారంగా తర్వాత కూడా సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

మరోవైపు అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. విద్యా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటించారు. కడప అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో సెలవులు ఇచ్చారు. బాపట్ల, గుంటూరు సెలవులు ఇవ్వగా.. కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో సెలవులు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలో ఐదు రోజుల పాటు సెలవు ప్రకటించారు.

మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More