Diwali Special Train : దీపావళి స్పెషల్.. చెన్నై-హౌరా వన్ వే ట్రైన్.. ఏపీలో ఆగే స్టేషన్లు
Diwali Special Train : దీపావళి రద్దీ కారణంగా రైల్వే శాఖ స్పెషల్ వన్ వే రైలును నడుపుతోంది. చెన్నై-హౌరా మధ్య నడిచే ఈ ట్రైన్ ఏపీలోని పలు కీలక స్టేషన్లలో ఆగుతుంది.
దీపావళి పండుగ రద్దీని తట్టుకోవడానికి, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ రైల్వే (Southern Railway) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా హౌరా వెళ్లే ప్రయాణికుల కోసం డాక్టర్ ఎమ్.జి.ఆర్ చెన్నై సెంట్రల్ – హౌరా వన్-వే ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (రైలు నంబర్: 06113) నడుపుతున్నట్లు ప్రకటించింది.
వన్ వే స్పెషల్ ట్రైన్
{{^htLoading}} {{/htLoading}}
ఈ రైలు నవంబర్ 5(గురువారం) రాత్రి 11:45 గంటలకు చెన్నైలో బయలుదేరనుంది. గమ్యస్థానం చేరుకునే సమయం నవంబర్ 7 శనివారం ఉదయం 10 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఇది ఒకే ఒక్క సర్వీస్ కలిగిన వన్-వే ప్రత్యేక రైలు. ఈ ప్రత్యేక రైలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
ఏపీలోని ఆగే స్టేషన్లు ఒంగోలు స్టేషన్‌కు నవంబర్ 6 ఉదయం 4:38 గంటలకు వచ్చి 4:40కి బయల్దేరుతుంది. విజయవాడ 7:10కి వచ్చి పదినిమిషాలపాటు ఆగి.. 7:20కి వెళ్తుంది. రాజమండ్రి-10:33, దువ్వాడ మధ్యాహ్నం 1:50, విజయనగరం సాయంత్రం 5, శ్రీకాకుళం రోడ్ 6 గంటలు, పలాస రాత్రి 8:03 గంటలకు వచ్చి 8:05కి బయల్దేరుతుంది.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటిన తర్వాత ఈ రైలు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రగచ్చి, హౌరా స్టేషన్లలో ఆగుతుంది. హౌరాకు ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలులో వివిధ శ్రేణుల ప్రయాణికులకు సరిపోయేలా బోగీలను కేటాయించారు. 1 - ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్, 2 - ఏసీ టూ-టైర్ కోచ్‌లు, 4 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 2 ఏసీ త్రీ-టైర్ ఎకానమీ కోచ్‌లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. 1 దివ్యాంగులకు అనుకూలమైన సెకండ్ క్లాస్ కోచ్, 1 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ ఉంటుంది. పండుగ వేళ రెగ్యులర్ రైళ్లలో రష్ ఎక్కువగా ఉన్నందున, ప్రయాణికులు ఈ ప్రత్యేక వన్-వే రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.