తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం - భార్యను నరికి చంపిన భర్త, అడ్డొచ్చిన అత్తను కూడా..

తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంకలో జంట హత్యలు వెలుగు చూశాయి.  భార్యను హత్య చేసి భర్త… ఆపై అత్తను కూడా నరికి చంపాడు.  కుటుంబ గొడవలే హత్యకు కారణమని తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Published on: Mar 3, 2026, 11:11:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. భార్యను హత్య చేసిన భర్త… ఆపై అత్తను కూడా కత్తితో నరికి చంపాడు. సీతానగరం మండలం బొబ్బిలంకలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జంట హత్యలు (representative image) (image istock)
జంట హత్యలు (representative image) (image istock)

ప్రాథమిక వివరాల ప్రకారం.. సీతారామరాజు, లత ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత… తల్లి లక్ష్మి ఇంటి వద్ద ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లి భర్త సీతారామరాజు… వారిద్దరన్నీ దారుణంగా నరికి చంపాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నిందితుడుతు గతంలోనూ ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More