...
...
Next Story

కారు సీటు కింద రూ. 9 కోట్ల బంగారం - సినీ ఫక్కీలో ఛేజ్ చేసి పట్టుకున్న డీఆర్ఐ!

విశాఖపట్నం సమీపంలో హైవేపై సినిమా ఫక్కీలో ఛేజ్ చేసి రూ. 8.98 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Published on: Oct 11, 2026, 13:21:21 IST
Advertisement

విశాఖలో అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో ఛేజ్ చేసి రూ. 8.98 కోట్ల విలువైన అక్రమ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు సీక్రెట్ గా రవాణా చేస్తున్న 5,832.90 గ్రాముల విదేశీ బంగారాన్ని సీజ్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

బంగారం పట్టివేత
బంగారం పట్టివేత

కోల్‌కతా మార్గంలో విదేశీ బంగారం అక్రమ రవాణా జరుగుతోందన్న స్పష్టమైన ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు జాతీయ రహదారిపై కాపు కాశారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక కారును గురిపెట్టి…. కొంతదూరం ఛేజ్ చేసి చివరకు అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తొలుత ప్రశ్నించగా వారు ఏమీ తెలియనట్లు నటించారు.

కారు సీటు కింద సీక్రెట్ గా…..

కారులో ఉన్నవారి సమాధానాలపై అనుమానం రావడంతో అధికారులు కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారు ముందు భాగంలో ప్యాసింజర్ సీటు కింద కాలి ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా తయారు చేసిన సీక్రెట్ బాక్సులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెరిచి చూడగా అందులో మూడు ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఉన్న 5,832.90 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్ల, 999 ప్యూరిటీ) విదేశీ బంగారం బయటపడింది. బహిరంగ మార్కెట్లో ఈ బంగారం విలువ సుమారు రూ. 8.98 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

కీలక విషయాలు….

పట్టుబడిన నిందితులను సమగ్రంగా విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బంగారాన్ని బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశపెట్టారని, అక్కడి నుంచి కోల్‌కతా మీదుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌లోని వ్యాపారులకు చేరవేసేందుకు తీసుకెళ్తున్నామని నిందితులు అంగీకరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks