LPG e-KYC : వంట గ్యాస్ ఈ-కేవైసీకి మరో ఛాన్స్.. ఈ తేదీలోపు కంప్లీట్ చేసుకోండి

LPG e-KYC : ఎల్పీజీ వంట గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణ(e-KYC) పూర్తి చేయడానికి సంబంధించిన తుది గడువును మరోసారి పొడిగించారు. వినియోగదారులు వెంటనే దీనిని చేసుకోవాలి.

Published on: Sep 8, 2026, 16:40:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ వంటగ్యాస్ వినియోగదారులు తమ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) కనెక్షన్‌ల ఇ-కేవైసీని పూర్తి చేయడానికి గడువును మళ్లీ సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. ఒక వారం పొడిగింపును ధృవీకరిస్తూ.. మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలలో (OMC) ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణలోని 1.26 కోట్ల ఎల్పీజీ వినియోగదారులలో 88 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

ఎల్పీజీ ఈకేవైసీ
ఎల్పీజీ ఈకేవైసీ

మిగిలిన వినియోగదారులు కూడా e-KYCని వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేయడంలో విఫలమైతే సిలిండర్లు ఏ ధరకు సరఫరా అవుతాయో అనే విషయం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ మళ్లీ గడువు పొడిగింపులు వినియోగదారులు e-KYC పూర్తి చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అయితే సబ్సిడీ సిలిండర్లు అర్హులైన వారికి మాత్రమే అందేలా చూసేందుకు చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యే అవకాశం లేదని చమురు రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారిలో చాలామంది ఒకే పేరు మీద బహుళ కనెక్షన్లు కలిగి ఉండటం లేదా ఇతరుల పేర్లపై ఉన్న కనెక్షన్లను ఉపయోగిస్తుండటమే దీనికి కారణమని అభిప్రాయపడుతున్నారు.

మిగిలిన వినియోగదారులు ఈ కేవైసీ కోసం ముందుకు వచ్చే వేగం నెమ్మదిగా ఉందని అధికారులు చెబుతున్నారు. వారం క్రితం రాష్ట్రంలో 86 శాతంగా ఈ కేవైసీ కోసం వచ్చారు. ఆగస్ట్ 23 నుండి ఆగస్టు 31 వరకు, ఆపై సెప్టెంబర్ 7 వరకు ఇటీవలి వారాల్లో గడువు చాలాసార్లు పొడిగించారు.

మరోవైపు ఈ-కేవైసీ ప్రక్రియతో సంబంధం లేని విషయాన్ని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు చమురు సంస్థలకు కీలక సూచన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు రెండో సిలిండర్ బుకింగ్ చేసుకోవడానికి ఉన్న 45 రోజుల నిరీక్షణ సమయాన్ని 25 రోజులకు తగ్గించాలని ఆదేశించింది. దీనితో పట్టణ ప్రాంతాల్లో అమలులో ఉన్న నిబంధనలే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ వర్తించనున్నాయి.

పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో గ్యాస్ డిమాండ్‌ను నియంత్రించేందుకు రెండు బుకింగ్‌ల మధ్య ఈ కనీస వ్యవధి నిబంధనను తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా మెరుగ్గా ఉండటం, గతంతో పోలిస్తే పెండింగ్ ఆర్డర్లు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు సంస్థలకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More