Wedding : ‘సిలిండర్లు మీరే తెచ్చుకోండి’- పెళ్లిళ్లను తాకిన గ్యాస్​ సెగ​! భారంగా ప్లేటు భోజనం..

Bengaluru Wedding news : పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా బెంగళూరులో పెళ్లిళ్ల సందడి తగ్గింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం, సిలిండర్ల కొరతతో క్యాటరింగ్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీనికి తోడు ముడిసరుకు ధరలు పెరగడంతో 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్' కాస్త బడ్జెట్ పెళ్లిళ్లుగా మారుతున్నాయి.

Published on: May 11, 2026, 14:01:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా- ఇరాన్ యుద్ధం సెగ భారత్​ దేశాన్ని వణికిస్తోంది. దాదాపు ప్రతి సెక్టార్​ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరీ ముఖ్యంగా దేశంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ పెరుగుతున్న గ్యాస్ ధరలు, సరుకుల కొరత అటు సామాన్యులను, ఇటు వ్యాపారులను భయపెడుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. ఫలితంగా క్యాటరింగ్​ ధరలు పెరుగుతున్నాయి, మెనూలో ఆహార రకాలు తగ్గిపోతున్నాయి. అంతేకాదు, గ్యాస్ సిలిండర్​ అరేంజ్​ చేయాలని లేకపోతే సిలిండర్​ కోసం రెట్టింపు డబ్బులు ఇవ్వాలని క్యాటరర్లు డిమాండ్​ చేస్తున్నారట!

బెంగళూరులో గ్యాస్ సంక్షోభం.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్
బెంగళూరులో గ్యాస్ సంక్షోభం.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్

బెంగళూరులో ఎల్పీజీ గ్యాస్​ కష్టాలు..

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా 993 పెరగడంతో క్యాటరింగ్ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రస్తుతం ఒక కమర్షియల్ సిలిండర్ అధికారిక ధర రూ. 3,152 ఉండగా, తీవ్రమైన కొరత కారణంగా క్యాటరర్లు ఓపెన్ మార్కెట్‌లో రూ. 8,000 కంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

క్యాటరింగ్‌పై ప్రభావం ఇలా..

ప్లేటు ధర పెంపు: గ్యాస్ ఖర్చులు పెరగడంతో ఒక్కో ప్లేటు భోజనంపై కనీసం రూ. 120 అదనంగా పెంచినట్లు క్యాటరర్లు చెబుతున్నారు. సాధారణంగా రూ. 150 నుంచి రూ. 200 వరకు ఉండే ప్లేటు ధర ఇప్పుడు చాలా బారంగా మారింది.

మెనూలో కోత: గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి మెనూలో కనీసం 5 నుంచి 7 రకాల ఐటమ్స్‌ను తగ్గించడమో లేదా గ్యాస్ తక్కువగా అవసరమయ్యే పదార్థాలను చేర్చడమో చేస్తున్నారు.

ఆర్డర్ల తిరస్కరణ: సిలిండర్ల కొరత వల్ల కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి క్యాటరర్లు వెనుకాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సిలిండర్లను పెళ్లి వారినే ఏర్పాటు చేసుకోవాలని కోరుతుండటం గమనార్హం.

వెడ్డింగ్ ప్లానర్ల కష్టాలు..

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అలంకరణ సామాగ్రి, ముడిసరుకుల ధరలు పెరిగాయి. దీనివల్ల పెళ్లిళ్ల ఖర్చులు సుమారు 30% నుంచి 40% పెరిగాయి.

అతిథుల సంఖ్య తగ్గింపు: పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా చాలా కుటుంబాలు గెస్ట్ లిస్టును, అలాగే ఈవెంట్ల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

స్థానిక వస్తువులకే ప్రాధాన్యం: విదేశాల నుంచి వచ్చే పూలు, అలంకరణ వస్తువుల సరఫరా నిలిచిపోవడంతో.. విలాసవంతమైన పెళ్లిళ్ల కోసం కూడా స్థానిక వస్తువులనే వాడుతున్నారు.

కార్మికుల కొరత: ఇటీవలి కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా కూలీలు, పనివారు దొరకకపోవడంతో చాలా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు తమ వ్యాపారాన్ని పరిమితం చేసుకున్నాయి.

ఆహారమే కీలకం..

మొత్తం వెడ్డింగ్ బడ్జెట్‌లో ఆహారానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. అలంకరణ, ఇతర ఖర్చులు తగ్గించుకున్నా.. ప్లేటుకు పెరిగిన ధరను చెల్లించి మరీ నాణ్యమైన భోజనం అందించడానికే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.

అయితే, యుద్ధం ఇలాగే కొనసాగి స్టాక్ అయిపోతే, రాబోయే శీతాకాలపు పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More